Perni Nani: ఏపీలో కుట్రలకు తెరలేపిన పేర్ని నాని
ABN , Publish Date - Jul 13 , 2025 | 08:24 AM
గుడివాడ వివాదంపై మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అయింది. కూటమి నేత, వైసీపీ నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నట్లు ఆ సంభాషణలో ఉంది.

కృష్ణాజిల్లా, మచిలీపట్నం: ఏపీలో అల్లర్లకు మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని (YSRCP Leader Perni Nani) కుట్ర పన్నుతున్నారు. గుడివాడ వివాదంపై రాష్ట్రంలో రచ్చ చేయాలని కుటిల రాజకీయానికి పేర్నినాని మరోసారి తెరదీశాడు. ఈ మేరకు గుడివాడ వివాదంతో ఏపీ వ్యాప్తంగా అలజడులు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే గుడివాడ వివాదంపై పేర్ని నాని ఫోన్ సంభాషణ లీక్ అవడంతో ఏదో ఒక విధంగా ఏపీలో కుయుక్తులు పన్నాలనే అతని పన్నాగం బయటపడింది. కూటమి నేత, వైసీపీ కీలక నేత మధ్య జరిగిన వాగ్వాదానికి కులం రంగు పులిమి వివాదం చేయాలని పేర్ని నాని ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, పేర్ని నాని మాట్లాడిన వీడియో కాల్ ద్వారా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌పై బురద జల్లాలనే పన్నాగం వెలుగులోకి వచ్చింది. బీసీ మహిళపై దాడి జరిగిందంటూ ఏపీవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అందరితో కలిసి వివాదం సృష్టించాలని ప్లాన్ చేశారు. లోకేష్ డైరెక్షన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యే వివాదం చేశారని ఏపీవ్యాప్తంగా ఆందోళన చేయించాలని ఫోన్ కాల్‌లో పేర్నినాని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరితో బీసీ మహిళ అని మాట్లాడించి ఆందోళన చేస్తే బాగుంటుందని తెలిపారు. లీడర్ (జగన్) చెబితే మనవాళ్లు జనాల్లోకి బాగా తీసుకెళ్తారని చెప్పారు. ఫోన్ కాల్ వీడియో ద్వారా తన కుటిల రాజకీయానికి మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి తెరదీశారు.
మచిలీపట్నంలో ఉద్రిక్తత
కాగా, మచిలీపట్నం బైపాస్ రోడ్డులో నిన్న(శనివారం అర్థరాత్రి) ఉద్రిక్తత చోటుచేసుకుంది. వంగవీటి మోహన రంగా ప్లెక్సీని గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. దీంతో ఆందోళనకు జనసైనికులు దిగారు. వంగవీటి రంగా ప్లెక్సీ చించివేతపై జనసైనికులు భగ్గుమన్నారు. ప్లెక్సీ చించివేతను నిరసిస్తూ నిరసన చేపట్టారు. ఈ సమాచారం అందుకుని ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పోలీసులకు రాతపూర్వకంగా జనసైనికులు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా పలు ప్లెక్సీలు చించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల మంత్రి నారా లోకేష్ ప్లెక్సీని చించివేశారని ఆరోపించారు. ప్లెక్సీలను చించి వేస్తున్న వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని జసైనికులు డిమాండ్ చేశారు. పోలీసులు సర్ధి చెప్పడంతో జనసైనికులు ఆందోళన విరమించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌కు మంత్రి పరామర్శ
For More AP News and Telugu News