Share News

Kodali Nani: గుడివాడ కోర్టుకు కొడాలి నాని.. ఎందుకంటే..

ABN , Publish Date - Jun 27 , 2025 | 04:50 PM

గుడివాడలో మాజీమంత్రి కొడాలి నాని సుదీర్ఘ విరామం తర్వాత కనిపించారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ కోసం గుడివాడ కోర్టుకు కొడాలి నాని హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని వచ్చారు.

Kodali Nani: గుడివాడ కోర్టుకు కొడాలి నాని.. ఎందుకంటే..
YSRCP Leader Kodali Nani

కృష్ణాజిల్లా (గుడివాడ): మాజీమంత్రి, వైసీపీ కీలక నేత కొడాలి నాని (YSRCP Leader Kodali Nani) సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో కనిపించారు. ఓ కేసులో ముందస్తు (యాంటిసిపేటరీ) బెయిల్ కోసం ఇవాళ(శుక్రవారం) గుడివాడ కోర్టుకు ఆయన హాజరయ్యారు. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నాని సహా ఆయన అనుచరులపై కేసు నమోదైంది. ఈ కేసులోనే ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు కొడాలి నాని.


అయితే, కింది కోర్టులో బెయిల్ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు కొడాలి నాని గుడివాడ కోర్టుకు హాజరయ్యారు. ఇక ఈ కేసులో కొడాలి నాని అనుచరులు 16 మంది ఇప్పటికే బెయిల్‌పై విడుదలయ్యారు. అయితే, వీరు పోలీస్ కస్టడీలో కొడాలి నాని చెబితేనే దాడి చేసినట్లు అంగీకరించారు. దీంతో కొడాలి నానిపైనా కేసు నమోదు చేశారు. ఆ తరువాత అనారోగ్య కారణాలు, ఇతర కారణాలతో గుడివాడలో కనిపించకుండా పోయారు కొడాలి. మళ్లీ ఏడాది తరువాత గుడివాడలో కనిపించారు. ఇక కొడాలి రాకతో కోర్టు వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.


రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌..

కాగా.. కొడాలి నాని గుడివాడ రాక రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయంతో గుడివాడకు దూరంగా కొడాలి నాని ఉంటున్నారు. ఈ క్రమంలో ఇంతకాలం తరువాత నాని వచ్చిన విషయం తెలుసుకొని ఇంటి వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. ఈరోజు (శుక్రవారం) సాయంత్రం ఆయన ఇంటి నుంచి నేరుగా హైదరాబాద్‌కి వెళ్లనున్నారు. ఒక్కసారిగా కోర్టు వద్ద కొడాలి నాని ప్రత్యక్షం కావడంతో పోలీసులు ఖంగుతిన్నారు. కొడాలి నానిని ఎవరెవరు కలుస్తున్నారు, వారి కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. ఇప్పటికే కొడాలి నాని, ఆయన అనుచరులు చేసిన అరాచకాలపై ఏపీ పోలీసుల విచారణలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

AP Tourism: పర్యాటక రంగం.. సీఎం సూచనలతోనే ముందుకు: మంత్రి దుర్గేష్

సింగయ్య మృతి కేసు.. జగన్ వాహనం చెకింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 06:31 PM