Yanamala On Jagan: అధికారం కోసం ఏమైనా చేస్తారు.. జగన్‌పై యనమల ఫైర్
ABN , Publish Date - Jul 14 , 2025 | 12:38 PM
Yanamala On Jagan: జగన్ కూడా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా అనేక కుట్రలకు పాల్పడ్డారని యనమల మండిపడ్డారు. జగన్ ప్రస్తుతం ఆయన తల్లి, చెల్లికి వ్యతిరేకంగా కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అమరావతి, జులై 14: మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jaganmohan Reddy), వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు (TDP Leader Yanamala Ramakrishnudu) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు వయస్సు 76 సంవత్సరాలు అని.. ఆయన ఎన్ని రోజులు బతుకుతారని.. ఎన్ని రోజులు సీఎంగా కొనసాగుతారంటూ మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లపై యనమల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం తాను అధికారంలోకి రాలేనని జగన్ ఆందోళనగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో జగన్, వైసీపీ నేతలు తీవ్ర ఫస్ట్రేషన్‌లో ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. అందువల్లనే రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు చంద్రబాబు లేదా టీడీపీ నేతలపై వైసీపీ శ్రేణులు దాడులకు ప్రయత్నించే అవకాశం ఉందని టీడీపీ సీనియర్ నేత సందేహం వ్యక్తం చేశారు.
రాజకీయ ప్రత్యర్థులను తొలగించడం వైఎస్ కుటుంబానికి కొత్త కాదని తెలిపారు. తనకు సీఎం పదవి ఇవ్వలేదన్న అక్కసుతో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలలో జగన్ క్రూర రాజకీయాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. అధికారం కోసం వైఎస్ కూడా తన హయాంలో పాతబస్తీలో కల్లోలం సృష్టించారని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు పీవీ నరసింహారావు, నేదురుమల్లి, విజయభాస్కర్ రెడ్డి వంటి వారిని వైఎస్ రాజకీయ వేధింపులకు గురి చేశారని ఆరోపించారు.
వైఎస్, జగన్ రాజకీయాల కోసం, అధికార పీఠం కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని ఫైర్ అయ్యారు. తనపై ఉన్న 11 క్రిమినల్ కేసులతో జైలులో ఉన్న సమయంలో సహాయం చేసిన తల్లి విజయమ్మ, సోదరి షర్మిలను కూడా జగన్ రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తల్లి, చెల్లిని కూడా రాజకీయంగా తొలగించాలన్న కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు. జగన్ జైలులో ఉన్న సమయంలో అతని కోసం కష్టపడినప్పటికీ వారికి వ్యతిరేకంగా తన స్వప్రయోజనాల కోసం జగన్ ఎంతకైనా తెగిస్తారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ భర్తపై కేసు నమోదు..కారణమిదే
నిర్బంధంలో కాదు.. స్వేచ్ఛ వాతావరణంలో పండుగలు జరగాలి: తలసాని
Read Latest AP News And Telugu News