Minister Nara Lokesh: మంగళగిరి అభివృద్ధికి మంత్రి లోకేష్ స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:55 AM
మంగళగిరి అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. నియోజకవర్గాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అధికారులకు మంత్రి నారా లోకేష్ వందరోజుల కార్యాచరణ రూపొదించారు.

మంగళగిరి: మంగళగిరి అభివృద్ధికి (Mangalagiri Development) ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. మంగళగిరిలో రోడ్లపై ఎక్కడ గుంతలు లేకుండా చూడాలని ఆదేశించారు. అధికారులు ఛాలెంజ్‌గా తీసుకుని వందరోజుల్లో చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. మంగళగిరిని ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. స్వచ్ఛతలో తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్‌ను నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను లాంఛనంగా ప్రారంభించామని చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్.
చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ఇవాళ(సోమవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో లోకేష్ మాట్లాడారు. చెత్తను తరలించేందుకు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న రూ.1.91 కోట్ల విలువైన రెండు కాంపాక్టర్ వాహనాలు ఏపీలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు మంత్రి నారా లోకేష్.
ఎంటీఎంసీ పరిధిలో బీటీ రోడ్లపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు రూ.1.48 కోట్ల విలువైన పాత్ హోల్ రిపేర్ వాహనంతో పాటు సుమారు రూ.1.2 కోట్ల విలువైన రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. మంగళగిరిలో రోడ్లపై గుంతలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వందరోజుల ఛాలెంజ్‌ను అధికారులు స్వీకరించాలని మార్గనిర్దేశం చేశారు. వంద రోజుల తర్వాత రోడ్లపై ఏమైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛాంధ్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. మంత్రి లోకేష్ ఛాలెంజ్‌ను తాము స్వీకరిస్తున్నామని, స్వచ్ఛతలో మంగళగిరిని నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు మంత్రి లోకేష్‌కి మాటిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
విద్యుత్ చార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి
For More AP News and Telugu News