TDP Vs YSRCP: కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ భర్తపై కేసు నమోదు..కారణమిదే
ABN , Publish Date - Jul 14 , 2025 | 11:40 AM
TDP Vs YSRCP: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు నాగవరప్పాడు జంక్షన్ వద్దకు వెళ్లారు. అయితే ఈ సమయంలో జెడ్పీ చైర్‌పర్సన్ హారిక భర్త రాము కారు మాదాల సునీతను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.

కృష్ణా జిల్లా, జులై 14: కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముపై గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. నాగవరప్పాడు వంతెన వద్ద కారు ఢీకొట్టడంతో తెలుగు మహిళా నేత మాదాల సునీతకు గాయాలు అయ్యాయ్యి. దీంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సునీత చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఉప్పాల రాము, వైసీపీ నేత కందుల నాగరాజుపై సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో ఉన్న వైసీపీ నేతలు తనను వల్గర్‌గా దూషించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. తెలుగు మహిళా నేత ఫిర్యాదు మేరకు ఉప్పాల రాము, సహా కొంతమంది వైసీపీ నేతలపై 129(a) 79, r/w 3(5) బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద గుడివాడ వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాగా.. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు నాగవరప్పాడు జంక్షన్ వద్దకు వెళ్లారు. అయితే ఈ సమయంలో జెడ్పీ చైర్‌పర్సన్ హారిక భర్త రాము కారు మాదాల సునీతను ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. అయితే కారులో ఉన్న వైసీపీ నేతలు తమపై అసభ్యపదజాలంతో దూషించడంతో పాటు కారుతో దూసుకొచ్చిరంటూ సునీత పేర్కొన్నారు. తెలుగు మహిళా నేత ఫిర్యాదు మేరకు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తమ కారు అద్దాలను ధ్వంసం చేశారంటూ టీడీపీ నేతలపై హారిక ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఈ కేసుల వివరాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి
నిర్బంధంలో కాదు.. స్వేచ్ఛ వాతావరణంలో పండుగలు జరగాలి: తలసాని
నన్ను ఆనందపర్చండి.. మీ కొంగు బంగారం చేస్తా: స్వర్ణలత భవిష్యవాణి
Read Latest AP News And Telugu News