Share News

Visakhapatnam: తస్సాదియ్య,, లాబ్‌ స్టార్‌ రొయ్య

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:20 AM

మాంసాహార ప్రియులకు చేపల్లో ‘పులస’ ఎలా నోరూరిస్తుందో రొయ్యల్లో లాబ్‌స్టార్‌ కూడా అంతే!. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే లభించే ఈ రొయ్యను ఆస్వాదించేందుకు పోటీ పడతారు. దీంతో ఈ రొయ్యకు...

Visakhapatnam: తస్సాదియ్య,, లాబ్‌ స్టార్‌ రొయ్య

మాంసాహార ప్రియులకు చేపల్లో ‘పులస’ ఎలా నోరూరిస్తుందో రొయ్యల్లో లాబ్‌స్టార్‌ కూడా అంతే!. ఎప్పుడో ఒక్కసారి మాత్రమే లభించే ఈ రొయ్యను ఆస్వాదించేందుకు పోటీ పడతారు. దీంతో ఈ రొయ్యకు భారీ డిమాండ్‌ ఉంది. తాజాగా విశాఖకు చెందిన ఓ మత్స్యకారుడి వలకు రెండు లాబ్‌స్టార్‌ రొయ్యలు చిక్కాయి. వీటిని ఆదివారం ఫిషింగ్‌ హార్బర్‌కు తెచ్చి విక్రయించగా ఒక్కొక్కటీ రూ.2,500 చొప్పున ధర పలికింది. ఒక్కొక్క రొయ్య కిలోన్నర ఉంటుందని మత్స్యకారుడు తెలిపారు. ఈ ఽరొయ్య రుచిగా ఉండడంతోపాటు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చని చెప్పారు.

-విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి.

Updated Date - Jul 14 , 2025 | 05:22 AM