Share News

Flash Floods: విశాఖలో కుంభవృష్టి

ABN , Publish Date - Jul 14 , 2025 | 05:01 AM

విశాఖనగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు జోరున కురిసిన వర్షానికి కాలువలు,డ్రెయినేజీలు నిండిపోయి వరదలా పారింది.పలుప్రాంతాల్లో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి.

Flash Floods: విశాఖలో కుంభవృష్టి

  • ఆకస్మికంగా ముంచెత్తిన వాన.. ఉరుములు, పిడుగులతో భారీ వర్షం

  • నీటి ప్రవాహానికి కొట్టుకు పోయిన వాహనాలు

విశాఖపట్నం,జూలై 13(ఆంధ్రజ్యోతి): విశాఖనగరాన్ని వర్షం ముంచెత్తింది. ఆదివారం మధ్యాహ్నం సుమారు రెండు గంటల పాటు జోరున కురిసిన వర్షానికి కాలువలు,డ్రెయినేజీలు నిండిపోయి వరదలా పారింది.పలుప్రాంతాల్లో వాహనాలు సైతం కొట్టుకుపోయాయి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రతతో జనం అల్లాడిపోయారు. మధ్యాహ్నం 2గంటలకు ఒక్కసారిగా మేఘాలు కమ్మేసి ఉరుములు, పిడుగులతో భారీవర్షం కురిసింది. రోడ్లపై పార్కుచేసిన ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. సీతమ్మధారలో 34.0,ధారపాలెంలో 24 మి.మీ. వర్షపాతం నమోదైంది.


నేడు రెండు అల్పపీడనాలు

పశ్చిమబెంగాల్‌, ఉత్తర ఒడిశాకు ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఆదివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. ఇంకా ఆదివారం మధ్యప్రదేశ్‌లోని మధ్య, ఉత్తర ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.దీని ప్రభావంతో సోమవారం మధ్యప్రదేశ్‌లోని వాయువ్య భాగంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ రెండు అల్పపీడనాల ప్రభావంతో ఒడిశా, శ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌, తూర్పు రాజస్థాన్‌లో పలుచోట్ల భారీ నుంచి కుంభవృష్టి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఈనెల 17వ తేదీ నుంచి ఉత్తరకోస్తాలో వర్షాలు పెరగనున్నాయి.ఈ నెల 18, 19న కోస్తాలో అనేక చోట్ల వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఆదివారం కోస్తా, రాయలసీమలో అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రత, ఉక్కపోతతో కూడిన వేడి వాతావరణం నెలకొంది.

Updated Date - Jul 14 , 2025 | 05:04 AM