Share News

AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

ABN , Publish Date - Jul 14 , 2025 | 06:57 AM

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న(ఆదివారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై చోటు చేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి చెరవుకట్టపై బోల్తా పడింది.

AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి
Annamayya District Tragedy

అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్‌లో నిన్న(ఆదివారం) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Fatal Road Accident) జరిగింది. లారీ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై చోటుచేసుకుంది. రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడుతో వెళ్తున్న సమయంలో లారీ అదుపు తప్పి చెరవుకట్టపై బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో 10 మంది కూలీలకు తీవ్రగాయాలు అయ్యాయి.


క్షతగాత్రులని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యులు వారి పరిస్థితిని సమీక్షించి చికిత్స అందిస్తున్నారు. తొమ్మిదిమంది మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతులు సబ్బరత్నమ్మ(45), చిట్టెమ్మ(25), గజ్జల లక్ష్మీదేవి (36), రాధ (39), వెంకట సుబ్బమ్మ(37) గజ్జల రమణ(42), మణిచంద్ర(38), గజ్జల దర్గయ్య(32), గజ్జల శీను(33) గుర్తించారు.


మృతులు రైల్వేకోడూరు మండలం సెట్టిగుంట వాసులుగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం మొత్తం విషాదకరంగా మారింది. సమాచారం అందగానే ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. ఈ విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

విద్యుత్‌ చార్జీలు పెంచం: మంత్రి గొట్టిపాటి

26న సింగపూర్‌కు చంద్రబాబు

For More AP News and Telugu News

Updated Date - Jul 14 , 2025 | 12:23 PM