Share News

AP Liquor Scam: స్వాధీనం చేసిన రూ.11 కోట్లు బ్యాంకులో జమ

ABN , Publish Date - Aug 02 , 2025 | 06:05 PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ద్వారా పట్టుబడిన రూ.11 కోట్లు బ్యాంకులో సిట్ అధికారులు శనివారం డిపాజిట్ చేశారు. ఆ నోట్లను వీడియో తీయాలని, విడిగానే ఉంచాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటీషన్ వేశారు.

AP Liquor Scam: స్వాధీనం చేసిన రూ.11 కోట్లు బ్యాంకులో జమ
AP Liquor Scam

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం (AP Liquor Scam) ద్వారా పట్టుబడిన రూ.11 కోట్లు బ్యాంకులో సిట్ అధికారులు ఇవాళ(శనివారం) డిపాజిట్ చేశారు. ఆ నోట్లను వీడియో తీయాలని, విడిగానే ఉంచాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటీషన్ వేశారు. అన్ని నోట్ల కట్టలను ఫొటోలు, వీడియో తీయించినట్లు కోర్టుకు సిట్ అధికారులు తెలిపారు. బ్యాంకులో డిపాజిట్ చేసిన రూ.11 కోట్లను విడిగానే భద్రపరచాలని సిట్‌కు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల కాపీలను బ్యాంకు అధికారులకు కసిరెడ్డి తరపు న్యాయవాదులు అందజేశారు.


కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిటిషన్..

కాగా, తొలుత సీజ్ చేసిన రూ.11 కోట్లను బ్యాంక్‌లో డిపాజిట్ చేయకుండా అడ్డుకోవాలని ఏసీబీ కోర్టులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. సీజ్ చేసిన నోట్ల సీరియల్ నంబర్స్ నోట్ చేయకుండా బ్యాంకులో సిట్ డిపాజిట్ చేసేందుకు సిద్ధమైందని పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ కోర్టుకు హాజరవ్వాలని ఐవోకు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. లిక్కర్ స్కాంలో సీజ్ చేసిన నగదును బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఏసీబీ కోర్టుకు ఐవో తెలిపారు. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన వివరాల డిపాజిట్ ఫార్మ్ ఇవ్వాలని రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు కోరారు. డిపాజిట్ వివరాలను ఐవో ఏసీబీ కోర్టుకు అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అమర్నాథ్ దిగజారి మాట్లాడుతున్నారు.. ఎంపీ శ్రీభరత్ ఫైర్

ఏపీ లిక్కర్ స్కామ్‌ కేసులో బిగ్‌బాస్‌ అరెస్ట్ ఖాయం

Read Latest AP News and National News

Updated Date - Aug 02 , 2025 | 06:37 PM