Share News

Road Accident in Nandigama: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు..

ABN , Publish Date - Nov 18 , 2025 | 08:08 AM

ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్‌ బస్సుకు ఘోర రోడ్డు ప్రమాదం ఇవాళ(మంగళవారం) జరిగింది. ఈ ఘటనలో 11 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాతులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.

Road Accident in Nandigama: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 11మందికి గాయాలు..
Road Accident in Nandigama

ఎన్టీఆర్ జిల్లా, నవంబరు18(ఆంధ్రజ్యోతి): కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాల (Road Accident) నివారణపై ఎంతగానో అవగాహన కల్పిస్తున్నాయి. కొంతమంది ప్రైవేట్ ట్రావెల్స్ (Private Travels) డ్రైవర్లు మీతిమిరిన వేగంతో వెళ్తూ ప్రయాణికుల భద్రతను గాలికొదిలేస్తున్నారు.


తాజాగా ఎన్టీఆర్ జిల్లా నందిగామలో కావేరి ట్రావెల్స్‌ బస్సు ఘోర రోడ్డు ప్రమాదానికి ఇవాళ(మంగళవారం) గురైంది. ఈ ప్రమాదంలో 11 మందికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే ఈ ఘటనకు సంబంధించిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ బస్సు వేగంగా వెళ్తూ అనాసాగరం ఫ్లైఓవర్‌పై లారీని ఓవర్‌టేక్ చేయబోయి బలంగా ఢీ కొట్టిందని పోలీసులు పేర్కొన్నారు.


ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్తుందని.. ఇందులో మొత్తం 35మంది ప్రయాణికులు ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం అనాసాగరం ఫ్లైఓవర్‌పై జరగడంతో ట్రాఫిక్ స్థంభించిపోయింది. రోడ్డుకు అడ్డంగా పడిన బస్సును పక్కకు తీయించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా పోలీసులు.


కాగా, కొన్ని రోజుల క్రితం కర్నూలు జిల్లాలో వేమూరి ట్రావెల్స్‌కు చెందిన బస్సుకు అగ్నిప్రమాదం జరిగి 19మంది మృతిచెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అయినా ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్లు ప్రయాణికుల భద్రతను పట్టించుకోవడం లేదు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆయా ఘటనల్లో పలువురు మృతిచెందుతోండటంతో కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. ఇలాంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై తక్షణమే సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు.. రవి నెట్‌వర్క్‌లో షాకింగ్ విషయాలు

సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 18 , 2025 | 09:50 AM