Share News

Gudivada Flexi War: గుడివాడలో పోటాపోటీ ఫ్లెక్సీలు.. టెన్షన్..టెన్షన్

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:39 PM

Gudivada Flexi War: టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడలో రాజకీయం హీటెక్కింది. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు.

Gudivada Flexi War: గుడివాడలో పోటాపోటీ ఫ్లెక్సీలు.. టెన్షన్..టెన్షన్
Gudivada Flexi War

విజయవాడ, జులై 12: గుడివాడలో (Gudivada) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం హీటెక్కింది. కుప్పంలో చంద్రబాబు గెలవరని గతంలో మాజీ మంత్రి కొడాలి నాని (Former Minister Kodali Nani) చేసిన సవాల్‌ను గుర్తు చేస్తూ టీడీపీ నేతలు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) బూట్‌ను కొడాలి నాని పాలిష్ చేస్తున్నట్లు‌గా నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ళ దగ్గర ఉంటానంటూ కొడాలి నాని చేసిన చాలెంజ్ నిలబెట్టుకోవాలంటూ గుడివాడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటైంది. మరోవైపు బాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అంటూ వైసీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. దీంతో పోటాపోటీ ఫ్లెక్సీలతో గుడివాడ రాజకీయం గరం గరంగా మారింది.


మరోవైపు నేడు (శనివారం) గుడివాడలో వైసీపీ నాయకుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి పేర్నినాని (Former Minister Perni Nani) ముఖ్యఅతిథిగా హాజరవడంతో ఉద్రిక్తత నెలకొంది. చీకట్లో కన్నుకొడితే.. తలలు నరికేయండి అంటూ పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా రెండు రోజుల నుంచి పేర్నినాని చేస్తున్న కామెంట్స్‌కు నిరసనగా... నాగవరప్పాడు జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేశారు. అయితే ఫ్లెక్సీని చించకుండా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. టీడీపీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై తెలుగుదేశం శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

పేర్నినాని అక్కడికి వెళ్లు.. నీ రప్పా..రప్పా సంగతి వాళ్లే చూస్తారు: బోడె ప్రసాద్

అర్చక నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఆనం

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 05:05 PM