Muharram: మొహర్రం పవిత్రతను గుర్తుచేసిన సీఎం చంద్రబాబు, లోకేష్
ABN , Publish Date - Jun 27 , 2025 | 09:53 AM
Muharram: మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని సీఎం చంద్రబాబు అన్నారు. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్‌ను శత్రువులు బలిగొన్న రోజు ఇదే అని తెలిపారు.

అమరావతి, జూన్ 27: మొహర్రం (Muharram) సందర్భంగా ముస్లిం సోదరులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సందేశం ఇచ్చారు. చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం అని.. మహమ్మద్ ప్రవక్త మనుమడు బలైన రోజు అని అన్నారు. ఈరోజుతో ఇస్లామ్ సంవత్సరం ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే మొహర్రంను పురస్కరించుకుని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) కూడా ట్విట్టర్‌లో స్పందించారు.
చంద్రబాబు ట్వీట్
‘మానవ హక్కుల కోసం జరిగిన చారిత్రాత్మక పోరాటానికి గుర్తు మొహర్రం. మహమ్మద్ ప్రవక్త మనుమడైన ఇమామ్ హుస్సేన్‌ను శత్రువులు బలిగొన్న రోజు ఇదే. మొహర్రం మాసం ఆరంభం రోజున ఇస్లామ్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సాంప్రదాయాలకు అనుగుణంగా మొహర్రం జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
మొహర్రం పవిత్రమైనది: లోకేష్
‘ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెలైన మొహర్రం, ముస్లింలకు పవిత్రమైనది. ప్రవక్త మహమ్మద్ మనవడు ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని గౌరవించే సంతాప కాలంలో త్యాగం, భక్తి, విశ్వాసం ప్రకటించడమే మొహర్రం’ అంటూ మంత్రి లోకేష్ ఎక్స్‌లో పోస్టు చేశారు
ఇవి కూడా చదవండి
మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక
వైభవంగా ప్రారంభమైన బోనాలు.. కిక్కిరిసిన కోట
Read Latest AP News And Telugu News