Share News

Vijayawada: విజయవాడలో మరో భారీ మోసం.. రంగంలోకి దిగిన పోలీసులు

ABN , Publish Date - Jun 27 , 2025 | 09:47 AM

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫిర్యాదుతో విజయవాడలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి.. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో వందల కోట్ల రూపాయిల మేర నగదును ప్రజలు మోసపోయినట్లు తెలుస్తోంది.

Vijayawada: విజయవాడలో మరో భారీ మోసం.. రంగంలోకి దిగిన పోలీసులు

విజయవాడ, జూన్ 27: ప్రజల ఆశలే పెట్టుబడిగా చేసుకుని పలువురు వ్యక్తులు పలు సంస్థలు స్థాపిస్తున్నారు. వారి నుంచి భారీగా పెట్టుబడుల రూపంలో నగదు దండుకుని ఆ తర్వాత.. ఆ సంస్థలను అర్థాంతరంగా మూసేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటన విజయవాడ నగరంలో చోటు చేసుకుంది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే.. అధిక వడ్డీ చెల్లిస్తామంటూ అద్విక ట్రేడింగ్ కంపెనీ ప్రచారం నిర్వహించింది. అందులో భాగంగా రూ. లక్ష పెట్టుబడి పెడితే.. నెలకు రూ. 6 వేలు చొప్పున వడ్డీ చెల్లిస్తామని ప్రచారం చేపట్టింది.


దీంతో భారీగా ప్రజలు.. ఆ ట్రేడింగ్ సంస్థకు పరుగులు తీశారు. ఆ క్రమంలో సదరు ట్రేడింగ్ కంపెనీకి అధిక మొత్తంలో నగదు చెల్లించారు. అయితే ఈ ట్రేడింగ్ కంపెనీ వ్యవహారంపై పలువురిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయవాడ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్యతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ సంస్థలో రూ. 300 కోట్లు వరకు నగదు దాదాపు 1200 మంది పెట్టుబడిగా పెట్టినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరిక

స్టాంపుల కుంభకోణంపై మంత్రి ఫైర్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 27 , 2025 | 09:47 AM