Supreme Court: మెరిట్ ఎస్సీ,ఎస్టీలను పరిగణించరాదు
ABN , Publish Date - Jun 27 , 2025 | 07:23 AM
సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీల్లో నాన్ కేడర్ ఎస్సీ, ఎస్టీ అధికారుల పదోన్నతులపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది.

సచివాలయ పదోన్నతులపై మార్గదర్శకాలు
అమరావతి, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, అడిషనల్ సెక్రటరీల్లో (నాన్ కేడర్) ఎస్సీ, ఎస్టీ అధికారుల పదోన్నతులపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించింది. అవి ఇలా ఉన్నాయి. మెరిట్, సీనియారిటీ ద్వారా ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు పొందిన పదోన్నతులను వారికిచ్చిన 15శాతం, 6శాతం రిజర్వేషన్లలో లెక్కించరాదు.
మెరిట్ పోను మిగిలిన పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు వరుసగా 15, 6శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ప్యానల్ సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు పూర్తిగా అమలైతే వాటిని సమీక్షించాల్సిన అవసరం లేదు. అయితే ఈ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదు. ఏదైనా కేటగిరీలో ఎస్సీ,ఎస్టీలు సరిపోయినంత మంది లేకుంటే, జనరల్ సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవాలి. వీటితోపాటు మరికొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి.