PV Jayanti: మాజీ ప్రధాని పీవీని స్మరించుకున్న చంద్రబాబు, లోకేష్
ABN , Publish Date - Jun 28 , 2025 | 09:39 AM
PV Jayanti: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు అని అన్నారు.

అమరావతి, జూన్ 28: మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు (Former PM PV Narsimha Rao) 104వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. పీవీని స్మరించుకున్నారు. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను దేశ పరిస్థితిని మార్చేశాయని గుర్తు చేసుకున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి మాజీ ప్రధాని అంటూ కొనియాడారు.
చంద్రబాబు ట్వీట్
‘భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధాని బాధ్యతలు స్వీకరించి ఆర్థిక సంస్కరణల ద్వారా దేశగతిని మార్చిన పీవీ ఎప్పటికీ స్ఫూర్తిగానే నిలుస్తారు. ఆ మహనీయుడి స్మృతికి మరొక్క మారు నివాళి అర్పిస్తున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
పీవీ సేవలు స్మరించుకుందాం: లోకేష్
‘దేశ మాజీ ప్రధానమంత్రి, భారతరత్న పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాను. తొలి తెలుగు ప్రధానిగా, ఆర్థిక సంస్కరణల రూపకర్తగా ఆయన కీర్తిగడించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీ నరసింహారావు. దేశానికి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేష్ పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి
Puri Rath Yatra: జగన్నాథుని రథయాత్రలో అపశృతి.. 500 మందికి పైగా గాయాలు
Phone Tapping: ఆ మెయిలే పట్టిచ్చింది!
Read Latest AP News And Telugu News