Share News

Polavaram Project: ఏపీ ఎంపీల్లో ప్రశ్నించే మగాడే లేడు

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:22 AM

పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు.

Polavaram Project: ఏపీ ఎంపీల్లో ప్రశ్నించే మగాడే లేడు

  • పోలవరం ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారు

  • పీసీపీ చీఫ్‌ షర్మిల ఘాటు విమర్శలు

ఏలూరు, రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించి నిర్వీర్యం చేస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. శుక్రవారం ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు ఎత్తును 45 నుంచి 41 మీటర్లకు తగ్గిస్తుంటే టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీల్లో ప్రశ్నించే ఒక్క మగాడు కూడా లేరని ఘాటుగా వ్యాఖ్యానించారు. బనకచర్లపై రాష్ట్ర ప్రయోజనాలే తమ స్టాండ్‌ అని, అన్ని పార్టీలతో కలసి నీటి హక్కుల కోసం పోరాడతామని చెప్పారు.


కాంగ్రెస్‌ ఒక మహాసముద్రం, పిల్ల కాలువలన్ని సముద్రంలోకి చేరాల్సిందేనని, వైసీపీకి కూడా ఇది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. ఆ తర్వాత షర్మిల రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ల సపోర్టుతోనే కేంద్రంలో మోదీ ధీమాగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఇంకా బలపడకపోతే, రాహుల్‌ ప్రధాని కాకపోతే ఒక్క విభజన హామీ నెరవేరదన్నారు. సీతంపేటల రాజీవ్‌గాంధీ పార్కులో దివంగత ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.

Updated Date - Jun 28 , 2025 | 05:22 AM