Share News

Minister Ram Mohan Naidu: జగన్‌రెడ్డికి శవ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:18 AM

జగన్‌రెడ్డికి శవ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు.

Minister Ram Mohan Naidu: జగన్‌రెడ్డికి శవ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

అరసవల్లి, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): జగన్‌రెడ్డికి శవ రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య అని కేంద్ర మంత్రి కె.రామ్మోహన్‌నాయుడు ధ్వజమెత్తారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో లిక్కర్‌ మాఫియా, ఇసుక మాఫియా, భూ మాఫియాతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. శ్రీకాకుళంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ‘వైసీపీ దళిత కార్యకర్త జగన్‌ కారు కింద పడి మరణిస్తే కనీసం పరామర్శ చేయాలన్న కనీస జ్ఞానం కూడా ఆయనకు లేదు.


శాంతి భద్రతలకు వారే విఘాతం కలిగించి, తిరిగి వారే గవర్నర్‌ను కలవడం విడ్డూరంగా ఉంది. జగన్‌ అరాచకాలను గుర్తించిన ప్రజలు విసిగిపోయి, ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం చేసినా ఆయనలో ఏమాత్రం మార్పు లేదు. ఏడాది కూటమి పాలన బ్రహ్మాండంగా ఉంది. ప్రజలు సంతోషంగా ఉన్నారు. వైసీపీ మాయ మాటలను ప్రజలు నమ్మడం మానేశారు. ప్రజల ఆశీస్సులే మాకు శ్రీరామరక్ష. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమంలో మరింత ముందుకు తీసుకు వెళతాం’ అని అన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 05:18 AM