Share News

Watchman Ranganna Wife: నా భర్త మృతిపై పలు అనుమానాలు.. రంగన్న భార్య షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Mar 06 , 2025 | 12:56 PM

YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా కలిగించింది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న మృతిచెందారు.అయితే రంగన్న మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన భార్య తెలిపింది.

Watchman Ranganna Wife: నా భర్త మృతిపై పలు అనుమానాలు.. రంగన్న భార్య షాకింగ్ కామెంట్స్
Watchman Ranganna Wife

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షి, వాచ్‌మన్ రంగన్న (85) అనారోగ్యంతో నిన్న(బుధవారం) మృతిచెందాడు. వయోభారం కారణంగా ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. రంగన్న మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా వాచ్‌మెన్ రంగన్న భార్య సుశీలమ్మ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. పోలీసులు, సీబీఐ వేధింపుల వల్లే తన భర్త రంగన్న అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది.


తన భర్త రంగన్న మృతికి పోలీసులే కారణమని సంచలన ఆరోపణలు చేసింది. తప్పుచే‌సింది ఒకళ్లు.. శిక్ష తన భర్త రంగన్నకు వేశారని ఆమె కన్నీరు పెట్టుకుంది. గత ఆరేళ్లుగా పోలీసులు తమ ఇంటి ముందు కాపలా ఉన్నారని తెలిపింది. పోలీసులు సరైన సమయంలో వైద్యంచేయించలేదని..మూడు నెలల నుంచి తన భర్త మంచాన పడ్డారని చెప్పింది. అప్పట్లో తప్పు చేసిన వారిని పట్టుకోకుండా తన భర్తను పట్టుకుని వేధించారని రంగన్న భార్య సుశీలమ్మ వాపోయింది.


అనారోగ్యంతో రంగన్న మృతి..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన నివాసంలో 2019 మార్చి 15వ తేదీన దారుణ హత్యకు గురయ్యారు. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా కలిగించింది. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న(85) మృతిచెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. నిన్న (బుధవారం) మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో రంగన్నను వెంటనే కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతునే రంగన్న కన్నుమూశారు. ఆయన మృతి వివేకా హత్య కేసులో మరింత చర్చనీయాంశంగా మారింది. అయితే రంగన్న మృతదేహానికి ఇవాళ(గురువారం) రిమ్స్‌లో పోస్టుమార్టం జరుగనుంది. రంగన్న అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ సీబీఐ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రంగన్న మృతదేహానికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. గతంలో సాక్షుల మృతి అనుమానస్పదం కావడంతో..రంగన్న మృతదేహానికి పోస్టుమార్టం చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Judicial Magistrate : పోసానికి ఆదోని కోర్టు రిమాండ్‌

AP Govt: పెట్టుబడుల పర్యవేక్షణకు‘స్టేట్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ గ్రూప్‌’

AP Govt: రెవెన్యూ చట్టాల్లో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 06 , 2025 | 01:53 PM