Digital Arrest: ఘోరం.. ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్
ABN , Publish Date - Nov 17 , 2025 | 02:14 PM
డిజిటల్ అరెస్టు పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ మోసగిస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్యని డిజిటల్ అరెస్ట్ పేరిట చీటింగ్‌కు పాల్పడ్డారు సైబర్ క్రిమినల్స్.
కడప, నవంబరు17 (ఆంధ్రజ్యోతి): డిజిటల్ అరెస్టు (Digital Arrest) పేరుతో పలువురిని సైబర్ క్రిమినల్స్ ఇటీవల మోసం చేస్తున్నారు. సైబర్ నేరస్తుల బారిన పడి బాధితులు పెద్దమొత్తంలో నష్టపోతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ (TDP Maiduguri MLA Putta Sudhakar Yadav) భార్యను సైతం డిజిటల్ అరెస్ట్ చేశారు కేటుగాళ్లు.
ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పుట్టా సుధాకర్ యాదవ్ . ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు ఏడుగురిని అరెస్ట్ చేశారు కడప జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు. డిజిటల్ అరెస్ట్‌కు పాల్పడిన నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఓ బ్యాంక్ మేనేజర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తమ నుంచి సైబర్ నేరస్తులు రూ.1.7కోట్లు మోసం చేశారని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పేర్కొన్నారు.
మరోవైపు.. డిజిటల్ అరెస్ట్‌పై ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కూడా స్పందించారు. తమ కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్‌కు గురయ్యారని తెలిపారు. పోలీసులను ఆశ్రయిస్తే సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. పైరసీని అరికట్టడంలో పోలీసుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. ఇవాళ(సోమవారం) హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ని సినీ ప్రముఖులు కలిశారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వందకుపైగా పైరసీ వెబ్‌సైట్లు.. రవి నెట్‌వర్క్‌లో షాకింగ్ విషయాలు
సౌదీ అరేబియా ఘటన.. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించండి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News