Palla Srinivasa Rao: ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. జగన్ అండ్ కోపై పల్లా ఫైర్
ABN , Publish Date - Jul 28 , 2025 | 01:08 PM
గత ఐదేళ్లు గుడ్డులా పొదుగులో దాక్కున నేతలు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా నేడు రాష్ట్ర అభివృద్ధిపై చీకటి రాజకీయం చేస్తున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా... ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డంగా పడి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిల్ల వైసీపీ సైకోల విష ప్రచారం శ్రుతి మించుతోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి వచ్చే పెట్టుబడులను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(సోమవారం) అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. దెయ్యాల్లా మంచిని జీర్ణించుకోలేక గోల చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు బుద్ధి చెప్పినా వారి తీరు మారడం లేదని దుయ్యబట్టారు. నీచ రాకీయాలు, అబద్ధాలతో వైషమ్యాలు సృష్టించేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు పల్లా శ్రీనివాసరావు.
ఇలాంటి రాక్షస మూకల, సైకో దెయ్యాల కోరలు పీకి పాతాళానికి తొక్కాలని హెచ్చరించారు. అప్పుడే ప్రజలకు మనశ్శాంతి.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి వికసిస్తుందని ఉద్ఘాటించారు. ఏపీలో జరుగుతున్న మంచిని చూసి జీర్ణించుకోలేక గోల చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాబట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువదలని విక్రమార్కుడిలా పనిచేస్తున్నారని నొక్కిచెప్పారు. సీఎం చంద్రబాబు విజన్ 2047 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారని తెలిపారు పల్లా శ్రీనివాసరావు.
గత ఐదేళ్లు గుడ్డులా పొదుగులో దాక్కున నేతలు అసలు అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా నేడు రాష్ట్ర అభివృద్ధిపై చీకటి రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా... ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారని, పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారని ధ్వజమెత్తారు. నాటి వైసీపీ పాలనలో ’ఇప్పుడే పెట్ట గుడ్డుపెట్టింది, పొదగడానికి సమయం పడుతుంది’ అంటూ ఒక కోడిగుడ్డు నేత కామెంట్ చేసింది ప్రజలందరికీ తెలుసునని విమర్శించారు. అధికారం ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయడం మరిచి.. నేడు పగిలిన గుడ్డు నుంచి వచ్చిన కోడి పిల్లలా మతిలేకుండా నోరు తెరుస్తున్నారని పల్లా శ్రీనివాసరావు విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ లిక్కర్ స్కాం ఢిల్లీ స్కాం కంటే పెద్దది: మంత్రి నిమ్మల
రాష్ట్రంలో పాజిటివ్ గవర్నెన్స్: మంత్రి సత్యప్రసాద్
Read latest AndhraPradesh News And Telugu News