Rammohan Naidu: రామ్మోహన్‌నాయుడికి అవమానం.. గుంటూరు పర్యటనలో మనసులో మాట బయటపెట్టిన కేంద్రమంత్రి
ABN , Publish Date - Jan 27 , 2025 | 02:55 PM
Rammohan Naidu: బీసీల సంక్షేమానికి సీఎం చంద్రబాబు ఎంతగానో కృషి చేస్తున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కేలా టీడీపీ అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులను పటిష్టం చేసేలా చంద్రబాబు పని చే'స్తున్నారని చెప్పారు. బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది కేవలం టీడీపీ హయాంలోనే అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

గుంటూరు జిల్లా: వైసీపీ హయాంలో మంత్రులకు ఎలాంటి అధికారం లేదని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Rammohannaidu Kinjarapu) విమర్శించారు. బీసీల ధైర్యాన్ని చూపించి పార్లమెంటులో తాను గట్టిగా నిలబడ్డానని తెలిపారు. తనను గతంలో పార్లమెంటులో అవమానించేలా వైసీపీ (YSRCP) సభ్యులు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రన్నాయుడు వారసుడిగా వచ్చిన తనను 3సార్లు ఎంపీగా గెలిపించారని గుర్తుచేశారు. వయసులో చిన్నవాడినైనా తనకు కేంద్రమంత్రిగా చంద్రబాబు (CM Chandrababu Naidu) అవకాశం కల్పించారని చెప్పారు. బీసీలంటే చంద్రబాబుకు ఎంత ప్రేమో చెప్పేందుకు తానే నిదర్శనమన్నారు. బీసీలంతా ఐకమత్యంతో పనిచేసి సమస్యల పరిష్కారం కోసం పని చేద్దామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఇవాళ(సోమవారం) గుంటూరు జిల్లాలో రామ్మోహన్ నాయుడు పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో రామ్మోహన్ నాయుడు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఏపీలో బీసీల నాయకత్వానికి స్వర్గీయ ఎన్టీఆర్ పునాదులు వేశారని తెలిపారు.
నేటి తరానికి ఈ విషయాలన్నీ తెలియజెప్పాల్సిన అవసరముందని అన్నారు. పంచాయతీ మెట్లు ఎక్కలేని బీసీలను పార్లమెంటు మెట్లు ఎక్కేలా తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) అవకాశం ఇచ్చిందని అన్నారు. ఎన్టీఆర్ వేసిన పునాదులను పటిష్టం చేసేలా చంద్రబాబు పని చేస్తున్నారని అన్నారు. బీసీలకు ఏదైనా కొత్త పథకం ప్రారంభమైందంటే అది కేవలం టీడీపీ హయాంలోనే అని తెలిపారు. చంద్రబాబు ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలతో బీసీలు బాగా చదువుకునే అవకాశం వచ్చిందని అన్నారు. బీసీ బిడ్డలు నేడు వైద్యులుగా, ఇంజనీర్లుగా దేశవిదేశాల్లో స్థిరపడేందుకు చంద్రబాబు కృషి చేశారని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే ఒక్కరితో సాధ్యం కాదు... అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని ఏలే తరంలో మన బీసీలు కూడా ఉండాలని అన్నారు. రాష్ట్రంలోని బీసీలంతా అండగా నిలిచారు కాబట్టే టీడీపీ అభ్యర్థులకు రికార్డు మెజార్టీలు దక్కాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Pawan Kalyan: నువ్వు మరిన్ని రికార్డులు నెలకొల్పాలి.. దేవాన్ష్‌కు పవన్ అభినందనలు
Ayyanna Patrudu Tourism: పర్యాటక రంగంపై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు
Read Latest AP News And Telugu News