Share News

Heavy Rains in AP: వరద పనులపై అలసత్వం

ABN , Publish Date - Apr 28 , 2025 | 11:37 AM

Heavy Rains in AP: పురపాలక సంఘాల్లో మురుగు, వరదనీటి కాల్వలు పూ డికతో నిండిపోయి.. ఓ వర్షాలకే పలు ప్రాంతాలు ముంపు నకు గురవుతున్నాయి. దీంతో వర్షాలు వస్తున్నాయంటే ప్రజ లు వణికిపోతున్నారు. వాస్తవానికి మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు నిరంతరం కొనసాగిస్తుండాలి. ప్రస్తుత వేసవి కాలం పూడికతీత పనులకు అనువైన వాతావరణం. అయితే ఆయా పనులపై పురపాలకులు ప్రణాళికలతో ముందుకు వెళ్లడంలేదు.

 Heavy Rains in AP:  వరద పనులపై అలసత్వం
Heavy Rains in AP

  • మాన్‌సూన్‌యాక్షన్‌ ప్లాన్‌ శూన్యం

  • వేసవి వచ్చినా పుర పాలకులు చోద్యం

  • మున్సిపాల్టీల్లో పూడిపోయిన

  • వరద నీటి కాల్వలు

  • భారీ వర్షం కురిస్తే మున్సిపాల్టీలో

  • కాలనీలు మునకే

వర్షాలతో వరద.. ఇళ్లు మునకతో మున్సిపాల్టీల్లో ప్రజలు వణికిపోతున్నారు. ఓ మోస్తరు వర్షాలు కురిసినా ఆ నీరు పోయే మార్గాలు లేక ఎక్కడికక్కడ కాలనీలు మునిగి పోతున్నాయి. ప్రజలకు వరద కష్టాలు తప్పించేందుకు మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాల్సిన పుర పాల కులు చోద్యం చూస్తున్నారు. వర్షాలతో ముంపు సమయా ల్లో హడావుడి చేయడానికే మున్సిపల్‌ అధికా రులు, పాలకులు ప్రాధాన్యం ఇస్తున్నారే కానీ ముందస్తు చర్యలపై శ్రద్ధ చూపడంలేదు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని మున్సిపల్‌ కేంద్రాల్లోని కాల్వలు జమ్ము, వ్యర్థాలు, తూటికాడలతో నిండి ఉంటున్నాయి. దీంతో ఓ మోస్తరు వర్షం పడినా ఆ నీరు పోయే మార్గాలు లేక లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. రోజుల తరబడి ఆ ప్రాంతాల్లోని నివాసితులు నీటి మధ్య అల్లాడుతున్నారు. అదే వేసవిలో డ్రెయిన్లలో పూడిక తీస్తే వర్షపు నీరు సాఫీగా పారుదలై ప్రజలకు ముంపు కష్టాలు లేకుండా ఉంటాయి. అయితే వర్షాకాల ముందస్తు ప్రణాళిక, పనులపై అటు పాలకులు, ఇటు అధికారులు పట్టీపట్టనట్లుగా ఉంటున్నా రు. వేసవిలో చేయాల్సిన పనులను వర్షాల సమయంలో చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి.


పనులు.. ఇలా చేయాలి

మున్సిపాల్టీల్లో పూడిపోయిన కాల్వలను పునరుద్ధరించి వరద నీరు సులువుగా ప్రవహించే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రధాన మురుగు కాల్వల్లో ప్రారంభం నుంచి చివరి వరకు పూడిక తీసి నీటి ప్రవాహానికి ఆటంకాలను తొలగించాలి. కాల్వల్లో పెరిగిన జమ్ము, నాచు తొలగిం చాలి. వర్షాకాల ముందస్తు పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలి. ఇంజనీరింగ్‌, ప్రణాళికా, పారిశుధ్య విభాగాల అధికారులు కమిటీగా ఏర్పడి సమన్వయంతో ఆయా పనులు చేయాలి. కాల్వలపై ఉన్న ఆక్రమణలు తొలగించి నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా చర్యలు తీసుకోవాలి.

వర్షాలతో వరద..

ఇళ్లు మునకతో మున్సిపాల్టీల్లో ప్రజలు వణికిపోతున్నారు. ఓ మోస్తరు వర్షాలు కురిసినా ఆ నీరు పోయే మార్గాలు లేక ఎక్కడికక్కడ కాలనీలు మునిగి పోతున్నాయి. ప్రజలకు వరద కష్టాలు తప్పించేందుకు మాన్‌సూన్‌ యాక్షన్‌ ప్లాన్‌ అమలు చేయాల్సిన పుర పాల కులు చోద్యం చూస్తున్నారు. వర్షాలతో ముంపు సమయా ల్లో హడావుడి చేయడానికే మున్సిపల్‌ అధికా రులు, పాలకులు ప్రాధాన్యం ఇస్తున్నారే కానీ ముందస్తు చర్యలపై శ్రద్ధ చూపడంలేదు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని మున్సిపల్‌ కేంద్రాల్లోని కాల్వలు జమ్ము, వ్యర్థాలు, తూటికాడలతో నిండి ఉంటున్నాయి. దీంతో ఓ మోస్తరు వర్షం పడినా ఆ నీరు పోయే మార్గాలు లేక లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. రోజుల తరబడి ఆ ప్రాంతాల్లోని నివాసితులు నీటి మధ్య అల్లాడుతున్నారు. అదే వేసవిలో డ్రెయిన్లలో పూడిక తీస్తే వర్షపు నీరు సాఫీగా పారుదలై ప్రజలకు ముంపు కష్టాలు లేకుండా ఉంటాయి. అయితే వర్షాకాల ముందస్తు ప్రణాళిక, పనులపై అటు పాలకులు, ఇటు అధికారులు పట్టీపట్టనట్లుగా ఉంటున్నా రు. వేసవిలో చేయాల్సిన పనులను వర్షాల సమయంలో చేస్తూ జేబులు నింపుకుంటున్నారన్న విమర్శలున్నాయి.


(నరసరావుపేట, ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘాల్లో మురుగు, వరదనీటి కాల్వలు పూ డికతో నిండిపోయి.. ఓ వర్షాలకే పలు ప్రాంతాలు ముంపు నకు గురవుతున్నాయి. దీంతో వర్షాలు వస్తున్నాయంటే ప్రజ లు వణికిపోతున్నారు. వాస్తవానికి మురుగు కాల్వల్లో పూడిక తీత పనులు నిరంతరం కొనసాగిస్తుండాలి. ప్రస్తుత వేసవి కాలం పూడికతీత పనులకు అనువైన వాతావరణం. అయితే ఆయా పనులపై పురపాలకులు ప్రణాళికలతో ముందుకు వెళ్లడంలేదు. సమస్య వచ్చినపుడు మాత్రమే నిద్ర మేల్కొ నడం అలవాటుగా మార్చుకున్నారన్న విమర్శలున్నాయి. వర్షా లు కురిసే ముందు హడావుడిగా పనులు చేపడుతున్నారు. దీని వల్ల ఫలితం లేకపోగా పాలకులు, కాంట్రాక్టర్లకు జేబు లు నిండుతున్నాయి. వర్షాకాలంలో పనులు కంటికి కనిపిం చవు.. ఖర్చుల లెక్కతేలదు.. దీంతో నిధులు పక్కదారి పడు తున్నాయి. ప్రతి మున్సిపాల్టీలో వేసవి ప్రణాళికను అమలు చేయాలి. వర్షాకాలంలో ప్రజలకు మురుగు.. వరద నీటి ఇబ్బందులు లేని విధంగా ముందస్తుగా చర్యలు చేపట్టాలి. వర్షాలు కురవక ముందే పురపాలక సంఘాలలో ముంపు నివారణకు అవసరమైన పనులు పూర్తి చేయాలి. గతంలో ఏఏ ప్రాంతాలు వరదనీటితో ముంపుకు గురయ్యాయో గుర్తించి ఆయా ప్రాంతాల్లో కాల్వలను అభివృద్ధి చేయాలి.


వర్షాలు కురిస్తే ఈ పనులు చేపట్టేందుకు వీలుండదు. ఇప్ప టికైనా ముంపు నివారణలో భాగంగా కాల్వల్లో పూడికత తీత పనులు చేపట్టాలి. గత అనుభవాలను పరిశీలనలోకి తీసుకుని వరద నీరు గృహాల్లోకి ప్రవేశించకుండా పూర్తి స్థాయి చర్యలు చేపట్టాలి. ఈ దిశగా మున్సిపల్‌ అధికారులు స్పందించడం లేదు. వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేసే విషయంలో పురపాలకులు మొద్దు నిద్ర వీడటం లేదు. జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురుస్తుంటాయని తెలిసినా పురపాలకుల్లో చలనం లేదు. సదరు విభాగాల అధికారులు వరద నీటి కాల్వల్లో పూడిక తీత పనులు, పగిలిన కట్టడాల పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు ఇంకా సమాయత్తం కాక పోవటం గమనార్హం. వరదల సమయంలో ముంపునకు గురయ్యే గృహాల వారికి సాయం అందించే కన్నా ముందస్తు చర్యలు తీసుకోవడం మిన్న అనే అంశాన్ని అధికారులు విస్మరిస్తున్నారు. దీంతో పట్ట ణ ప్రాంతాల్లో ఏటా ముంపు ప్రాంతాల్లోని ప్రజలు వరద కష్టాలను ఎదుర్కొంటు న్నా రు. ఈ ఏడాదైనా ప్రజలను ముంపు కష్టా ల నుంచి గట్టెక్కించేందుకు ఇప్పటికైనా వర్షాకాలం ముందస్తు పనులు చేప ట్టే అం శంపై ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.


కబ్జాలో కాల్వలు

జిల్లా కేంద్రాలైన గుంటూరు, నరసరావుపేట, బాపట్లతో పాటు మూడు జిల్లాల పరిధిలోని మున్సిపల్‌ పట్టణాల్లో వరద నీటి కాల్వలు చాలావరకు ఆక్రమణల పాలయ్యాయి. కాల్వలపైనే కొందరు నిర్మాణాలు చేపట్టారు. పూడిక తీయడానికి వీలు లేకుండా కబ్జా చేసేశారు. కాల్వలపై ఆక్రమణలతో వర్షపు నీరు పోయే మార్గాలు లేకపోయినా వాటి తొలగింపునకు కనీస ప్రయత్నాలు జరగడంలేదు. మున్సిపల్‌ రికార్డుల్లో నమోదైన ప్రకారం కాల్వల విస్తీర్ణం లేదు. కాల్వలను మాయం చేసేలా నిర్మాణాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భారీ వర్షాలు కురిస్తే రోడ్లు చెరువులను మరిపిస్తున్నాయి. పల్లపు ప్రాంతాల్లోని గృహాలు ముంపునకు గురవుతున్నాయి.


మొక్కుబడిగా మమ

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు వర్షాకాల ముందస్తు ప్రణాళికను పట్టిం చుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికా రంలోకి రాగానే పురపాలక సంఘాల్లో చిన్న, పెద్ద కాల్వల్లో పూడికతీత పనులు చేపట్టాలని భావించింది. గత జూలైలో పూడిక తీతకు నిధులు మంజూరు చేసింది. కొన్ని మున్సిపాల్టీల్లో ఈ పను లు మొక్కుబడిగా నిర్వహించారు. మరి కొన్ని మున్సిపాల్టీలు మమ అనిపించా యి. కేవలం నిధులు ఖర్చు చూపించా లన్న ఉద్దేశంతోనే పనులు చేపట్టారే కానీ ముంపు సమస్య పరిష్కరించా లన్న ఉద్దేశం లేదన్న విమర్శలు వచ్చాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

హరి‌రామ్‌ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి

మీ ఇంట్లో ఏపీ ఉందా.. అయితే ఈ జాగ్రర్తలు పాటించండి..

For More AP News and Telugu News

Updated Date - Apr 28 , 2025 | 12:39 PM