Pawan Kalyan: రాజమహేంద్రవరంలో పవన్ కల్యాణ్ పర్యటన.. షెడ్యూల్ ఇదే..
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:31 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గురువారం నాడు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారైంది.

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రేపు (గురువారం) రాజమహేంద్రవరం(Rajahmundry)లో పర్యటించనున్నారు. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో కలిసి అఖండ గోదావరి ప్రాజెక్ట్‌కి పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ షెడ్యూల్ ఖరారైంది. గురువారం ఉదయం 8.35 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు ఆయన బయలుదేరనున్నారు. 9.30 గంటలకు రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు ఉప ముఖ్యమంత్రి చేరుకోనున్నారు.
9.35 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి 10 గంటలకు రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌కు వెళ్తారు. 10 గంటల నుంచి 11 గంటల వరకు పుష్కరఘాట్ వద్ద కేంద్రమంత్రి షెకావత్‌తో కలిసి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్ట్ శంకుస్థాపనలో డిప్యూటీ సీఎం పాలుపంచుకుంటారు. 11.30 గంటల నుంచి 12.20 వరకు రూరల్ నియోజకవర్గం బొమ్మూరులో రీజనల్ సైన్స్ సెంటర్‌ని కేంద్ర మంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు.
12.40 గంటల నుంచి 1.10 గంటల వరకు రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువులో పారెస్ట్ అకాడమీ శంకుస్థాపనలో పవన్ కల్యాణ్ పాల్గొంటారు. 1.30 గంటల నుంచి 2.30 వరకు రాజమహేంద్రవరంలోని హోటల్ మంజీరాలో ఆయన బస చేయనున్నారు. 2.30 గంటలకు హోటల్ నుంచి బయలుదేరి 2.50కి రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టుకు డిప్యూటీ సీఎం చేరుకోనున్నారు. 2.55 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి 3.50 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకి పవన్ కల్యాణ్ చేరుకోనున్నారు.
ఇవి కూడా చదవండి
కేంద్ర కేబినెట్‌లో చంద్రబాబు, లోకేష్‌ను మెచ్చుకున్న ప్రధాని
ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు
Read latest AP News And Telugu News