Nara Bhuvaneswari: ఆ సమస్యలు పరిష్కరిస్తా.. కొమరవోలు గ్రామస్తులకు నారా భువనేశ్వరి హామీ
ABN , Publish Date - Mar 07 , 2025 | 01:20 PM
Nara Bhuvaneswari: కొమరవోలు గ్రామస్తులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కలిశారు. ఈ సందర్భంగా వారిని అప్యాయంగా పలకరించారు. కొమరవోలు గ్రామ సమస్యలు పరిష్కరిస్తానని నారా భువనేశ్వరి హామీ ఇచ్చారు.

కృష్ణాజిల్లా (పామర్రు): కొమరవోలును ఎప్పుడూ మర్చిపోనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఇవాళ(శుక్రవారం)పామర్రు మండలం దత్తత గ్రామమైన కొమరవోలు సచివాలయం వద్ద ప్రజలతో ముఖాముఖి సమావేశంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న గ్రామస్తుల వద్దకు వెళ్తూ భువనేశ్వరి ఆత్మీయంగా మాట్లాడారు. తమ సమస్యలను భువనేశ్వరి దృష్టికి కొమరవోలు గ్రామస్తులు తీసుకువచ్చారు. గత ఐదేళ్లుగా గ్రామంలో కనీసం రోడ్ల మరమ్మత్తులు కూడా చేయలేదని గ్రామస్తులు తెలిపారు. గత ఐదేళ్లుగా సున్నావడ్డీలు రావడం లేదని డ్వాక్రా సంఘాల మహిళలు చెప్పారు. ‘కష్టాలను ఒరిమితో సహన శిలివై పూలబాటలో నడిచిన ఓమాత భువనేశ్వరమ్మ’’ అంటూ రచించిన కవిత్వాన్ని కానుకగా లక్ష్మీస్వరి నారా భువనేశ్వరికి అందజేశారు.
కోమరవోలు రావడం సంతోషంగా ఉంది...
అనంతరం కొమరవోలు గ్రామస్తులను ఉద్దేశించి నారా భువనేశ్వరి మాట్లాడారు. ’నన్ను మేడం అని పిలవవద్దు నేను మీ భువనమ్మను’ అని చెప్పారు. కొమరవోలు రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజలు అడిగినవి చిన్న చిన్న సమస్యలు అని చెప్పారు. ఇచ్చిన హామీలతోపాటు సమస్యలన్నింటిని.... సీఎం చంద్రబాబు పరిష్కరిస్తారని అన్నారు. గ్రామంలో విభేదాలు ఉంటే మాట్లాడుకొని పరిష్కరించాలని.. వర్గాలను పక్కన పెట్టాలని సూచించారు. గ్రామస్తులందరూ కుటుంబం మాదిరి కలిసి ఉండాలని అన్నారు. ఒకరికి భయపడి గ్రామస్తులు తల దించుకోవాల్సిన అవసరం లేదన్నారు. పుట్టిన గ్రామానికి మనమందరం కలిసి మంచి చేసుకుందామని చెప్పారు. గ్రామంలో ఇంకా చాలా మంచి కార్యక్రమాలు నిర్వహిద్దామని నారా భువనేశ్వరి తెలిపారు.
భువనమ్మను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది: కొమరవోలు గ్రామస్తులు
భువనమ్మను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని కొమరవోలు గ్రామస్తులు తెలిపారు. దత్తత తీసుకున్న తర్వాత గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. సీఎం చంద్రబాబు, భువనేశ్వరిలపై తమకు ఎంతో నమ్మకం ఉందని అన్నారు. భువనేశ్వరి సేవలను తరతరాలుగా గుర్తించుకుంటామని చెప్పారు. ప్రజల తరఫున భవనమ్మకు పామర్రు ఎమ్మెల్యే కుమార్ రాజా ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Janasena leaders criticize Ambati: వైసీపీ పాకిస్థాన్.. కూటమి ఇండియా.. జనసేన నేతల ఫైర్
YSRCP: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకులు
Raghuramakrishna Raju : బుల్లెట్ దిగిందా.. లేదా.. అన్నట్టు మాట్లాడాలి..
Read Latest AP News and Telugu News