Share News

MP Kesineni Shivnath: వైసీపీ డ్రామా ఆర్టిస్టులకు గుణపాఠం చెబుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:40 AM

MP Kesineni Shivnath: పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆర్టిస్టులతో నాటకాలు ఆడిస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. వారికి తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు.

MP Kesineni Shivnath: వైసీపీ డ్రామా ఆర్టిస్టులకు గుణపాఠం చెబుతాం.. ఎంపీ కేశినేని శివనాథ్ మాస్ వార్నింగ్
MP Kesineni Shivnath

అమరావతి: మద్యం స్కాంలో అడ్డంగా దొరికిన జగన్... ప్రజల దృష్టి మళ్లించేందుకు కుట్రలు పన్నుతున్నారని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ఆరోపించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేసేందుకు.... విదేశీ పెట్టుబడుల కంపెనీలపై అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని విమర్శలు చేశారు. పుట్టి పెరిగిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనుకుంటున్న ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు.


ప్రవాసాంధ్రులకు తాము అండగా ఉంటామని... వాళ్లు నిర్భయంగా పెట్టుబడులు పెట్టవచ్చని ఎంపీ కేశినేని శివనాథ్ ధైర్యం చెప్పారు. ప్రవాసాంధ్రుల జోలికి ఎవరు వచ్చినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆఫీస్ అడ్రస్ కూడా లేని 21సూట్ కేసు కంపెనీలను పెట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ....ఈ దేశం కోసం సేవ చేయడానికి వచ్చే ప్రవాసాంధ్రులను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్ లాంటి వ్యక్తులు సమాజానికి చేటు కాబట్టే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. జగన్ ఆడించే డ్రామాలో భాగంగా ఆ పార్టీ ఉల్ఫా బ్యాచ్‌తో విభిన్న పాత్రలు పోషింపచేస్తున్నారని ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు.


ప్రజలు బుద్ధి చెప్పిన వ్యక్తుల గురించి ఆలోచించాల్సిన పనిలేదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. చేతనైతే తమపై నేరుగా రాజకీయాలు చేయాలని సవాల్ విసిరారు. పెట్టుబడిదారులను వెళ్లగొట్టేందుకు డ్రామా ఆర్టిస్టులతో ఆటలాడిస్తే తగిన గుణపాఠం చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా ఎన్నో ప్రయత్నాలు జగన్ ఉల్ఫా బ్యాచ్ చేస్తోందని ఆరోపించారు. ఏపీ మీద, నిరుద్యోగ యువత మీద ఎందుకింత కక్షకట్టారో సమాధానం చెప్పాలని ఎంపీ కేశినేని శివనాథ్ డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP NEWS: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..

Deputy CM Pawan Kalyan: ఇక స్థానిక ప్రభుత్వాలు

Visakhapatnam: రెండున్నర గంటలు పరుగెడుతూనే ఉన్నాం

Controversial Cases: అంతా ‘ఒక్క’టయ్యారు

Kashmir Terror Attack: ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి

For More AP News and Telugu News

Updated Date - Apr 25 , 2025 | 12:00 PM