Share News

MP Kalisetti: జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.. టీడీపీ ఎంపీ విసుర్లు

ABN , Publish Date - Apr 21 , 2025 | 11:30 AM

MP Kalisetti Appalanaidu: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ప్రభుత్వంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు.

MP Kalisetti: జగన్ వ్యవస్థలను భ్రష్టు పట్టించారు.. టీడీపీ ఎంపీ విసుర్లు
MP Kalisetti Appalanaidu

ఢిల్లీ: అమరావతి పునర్మాణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం శుభసూచకమని తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో రేపు(మంగళవారం) సమావేశం అవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తారని అన్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు.


అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి సూచిక అని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి మోదీ సహాయ సహకారాలతో ఈసారి అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిర్ణయిత సమయంలోనే పూర్తి చేస్తామని అన్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని విమర్శించారు. ఏపీకి ప్రధాని సహాయ సహకారాలు చాలా అవసరమని చెప్పారు. ప్రధాని అమరావతికి రావడం ద్వారా పెట్టుబడిదారుల్లో, ప్రజల్లో కొత్త శక్తి, ఉత్సాహం వస్తాయని.. తద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gujarath Tour: గుజరాత్‌లో రెండో రోజు మంత్రి నారాయణ బృందం పర్యటన

YS Sharmila: చంద్రబాబుకు శుభాకాంక్షలు

Birthday Celebrations: అట్లాంటాలో ఘనంగా సీఎం చంద్రబాబు 75వ పుట్టినరోజు వేడుకలు

For More AP News and Telugu News

Updated Date - Apr 21 , 2025 | 11:35 AM