Share News

Kolusu Parthasarathy: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగాలపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన

ABN , Publish Date - Jan 28 , 2025 | 08:27 PM

Kolusu Parthasarathy: పోలవరం ప్రాజెక్టు‌ను జగన్ నిర్వీర్యం చేశారని మంత్రి కొలుసు పార్థసారధి మండిపడ్డారు. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Kolusu Parthasarathy: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. ఉద్యోగాలపై మంత్రి కొలుసు పార్థసారధి కీలక ప్రకటన
Kolusu Parthasarathy

బాపట్ల : మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని మంత్రి కొలుసు పార్థసారధి ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను జగన్ సర్వనాశనం చేశారని విమర్శించారు. ఇవాళ(మంగళవారం) బాపట్ల జిల్లాలో మంత్రి కొలుసు పార్థసారధి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొలుసు పార్థసారధి పాల్గొని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులను సీఎం చంద్రబాబు తీసుకువచ్చారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు‌ను జగన్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. మంత్రులు అసభ్య పదజాలం, సినిమా డైలాగులతో కాలం వెళ్లబుచ్చారని విమర్శించారు. 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 20 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారధి పేర్కొన్నారు.


ఇరిగేష‌న్ అంశాల‌పై మంత్రి నిమ్మల రామానాయుడు చర్చ

nimmala-ramanaidu.jpg

విజ‌య‌వాడ: ఇరిగేష‌న్ శాఖ అధికారులకు మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ(మంగళవారం) ఇరిగేష‌న్ క్యాంపు కార్యాల‌యంలో స్పెష‌ల్ చీఫ్ సెక్రట‌రీ సాయిప్రసాద్, ఈఎన్సీ వెంక‌టేశ్వర‌రావు, ఇత‌ర ఇరిగేష‌న్ అధికారుల‌తో మంత్రి నిమ్మల రామానాయుడు స‌మీక్ష సమావేశం నిర్వహించారు. ఇరిగేష‌న్ శాఖాప‌ర‌మైన అడ్డంకుల‌ను అధిగ‌మించి, డీఈఈ, ఈఈ ప్రమోష‌న్స్ ఇవ్వడంపై మంత్రి నిమ్మల రామానాయుడు చ‌ర్చించారు. జైకా, నాబార్డ్, ఆర్ఆర్ఆర్ వంటి ప‌థకాల నుంచి నిధులు మంజూరుపై నివేదిక‌లు సిద్ధం చేసుకోవ‌డంపై రివ్యూ చేశారు. ఏఈఈల డైరెక్ట్ రిక్రూట్మెంట్, ల‌ష్కర్ల స్థితిగ‌తులు ఇత‌ర ఇరిగేష‌న్ అంశాల‌పై మంత్రి నిమ్మల రామానాయుడు స‌మాలోచ‌న‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

YS Sharmila: అప్పుడు కనబడలేదా ఆర్థిక భారం.. షర్మిల ఫైర్

Tirumala: తిరుమలకు ఇస్రో ఛైర్మన్.. గగన్‌యాన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు..

Nara Lokesh: ఉద్యోగుల కాళ్ల దగ్గర మంత్రి నేమ్ ప్లేట్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 28 , 2025 | 09:09 PM