Share News

Minister Ravi Kumar: విద్యుత్ చార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Mar 07 , 2025 | 11:53 AM

Minister Gottipati Ravi Kumar: వైసీపీ ప్రభుత్వంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో విద్యుత్ వ్యవస్థకు చాలా నష్టం జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

Minister Ravi Kumar: విద్యుత్ చార్జీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Minister Gottipati Ravi Kumar

అమరావతి: గత ఐదేళ్లలో విద్యుత్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం విచ్ఛిన్నం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆరోపణలు చేశారు. వైసీపీ నాయకులు పెంచిన విద్యుత్ చార్జీలపై వాళ్లే ధర్నాలు చేసి, ప్రశ్నలు అడుగుతున్నారని అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించిన పలు విషయాల గురించి అసెంబ్లీలో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ మాట్లాడారు. 2022-23,2023-24 సంవత్పరాలకు గానూ వైసీపీ ప్రభుత్వం రూ.15 వేల కోట్లు భారం మోపిందని చెప్పారు. 2014-19 వరకు టీడీపీ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదని స్పష్టం చేశారు. మిగులు విద్యుత్‌తో రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి అప్పగించామని తెలిపారు. జగన్ అనాలోచిత చర్యలతో నాడు 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి భారం మోపారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ధ్వజమెత్తారు.


వారిని తరిమి కొట్టారు..

రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులను కూడా వైసీపీ నాయకులు తరిమి కొట్టారని మండిపడ్డారు. గత టీడీపీ హయాంలో 8 గిగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేశామని తెలిపారు. అధిక ధరలకు విద్యుత్ కొనుగోళ్లకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోళ్లు భారీగా తగ్గాయన్నారు. జెన్‌కో నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ... విద్యుత్ కొనుగోళ్లకు చెక్ పెడుతున్నామని అన్నారు. కూటమి ప్రభుత్వం భవిష్యత్తులో కూడా విద్యుత్ చార్జీలను పెంచబోదని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా అసెంబ్లీ, శాసన మండలిలో వైసీపీ నాయకులు ప్రశ్నలు అడుగుతున్నారని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు.


టీడీఆర్ బాండ్లలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు: మంత్రి నారాయణ

Narayana.jpg

అమరావతి: గ‌త జగన్ ప్రభుత్వంలో టీడీఆర్ బాండ్లలో భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయని మంత్రి నారాయణ ఆరోపించారు. విశాఖ‌పట్నంలో టీడీఆర్ బాండ్ల అక్రమాల‌పై విజిలెన్స్, సీఐడీ విచార‌ణ జ‌రుగుతుందని తెలిపారు. నివేదిక రాగానే బాధ్యుల‌పై చ‌ర్యలు తీసుకుంటామని అన్నారు. ఒక్క విశాఖ‌లోనే కాదు త‌ణుకు, తిరుప‌తిలో కూడా అక్రమాలు చేశారని అన్నారు. ఏపీలో రాజీవ్ స్వగృహ కింద చేపట్టిన ప్రాజెక్టుల గురించి అసెంబ్లీలో మంత్రి నారాయణ మాట్లాడారు. త‌ణుకులో రూ.63.24 కోట్ల విలువ ఉన్న చోట రూ.754 కోట్లకు బాండ్లు జారీ చేశారని చెప్పారు. రూర‌ల్ ఏరియాలో భూమి తీసుకుని ప‌ట్టణంలో ఉన్న ఇంటి వాల్యూతో బాండ్లు ఇచ్చారన్నారు. తిరుప‌తిలో రూ.170.99 కోట్లకు 29 బాండ్లు జారీ చేశారన్నారు. గ‌త వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జ‌ర‌గ‌డంతో తాము వ‌చ్చిన త‌ర్వాత ఐదు నెల‌లు బాండ్లు జారీ నిలిపివేశామని మంత్రి నారాయణ చెప్పారు.


ప్రస్తుతం ఏపీలో 965 టీడీఆర్‌లు, విశాఖ‌పట్నంలో 266 టీడీఆర్‌లు పెండింగ్‌లో ఉన్నాయని మంత్రి నారాయణ అన్నారు. మూడు నెల‌ల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాల‌పై పూర్తి స్పష్టత ఇస్తామని తెలిపారు. 2007లో ఎంఐజీ ఇళ్లు అభివృద్ధి చేసేలా రాజీవ్ స్వగృహ ప్రాజెక్ట్ తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం,కర్నూలులో ప్రాజెక్ట్ పూర్తి అయింది... మిగిలిన చోట్ల పెండింగ్ ఉందని అన్నారు. మొత్తం 571.69 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ కొనసాగుతుందని చెప్పారు. ధరల విషయంలో మంత్రి వర్గ ఉపసంఘం పలు ప్రతిపాదనలు ఇచ్చిందని అన్నారు. అయితే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను రద్దు చేయాలంటే న్యాయపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రాజెక్ట్ అమల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో చర్చించి ఎలా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Janasena leaders criticize Ambati: వైసీపీ పాకిస్థాన్.. కూటమి ఇండియా.. జనసేన నేతల ఫైర్

YSRCP: ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వైసీపీ నాయకులు

Raghuramakrishna Raju : బుల్లెట్‌ దిగిందా.. లేదా.. అన్నట్టు మాట్లాడాలి..

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 07 , 2025 | 12:18 PM