Minister Narayana: జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసింది.. మంత్రి నారాయణ విసుర్లు
ABN , Publish Date - Mar 08 , 2025 | 02:49 PM
Minister Narayana: ఎన్నికల హామీల్లో మహిళల కోసం చాలా పథకాలు తీసుకువచ్చామని మంత్రి నారాయణ చెప్పారు. గత జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందని మంత్రి నారాయణ విమర్శలు చేశారు.

కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి అన్ని రకాలుగా కృషి చేస్తుందని మంత్రి నారాయణ తెలిపారు. కాకినాడలో మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి నారాయణ పాల్గొన్నారు. మహిళలను ఆర్థికంగా పైకి తీసుకురావాలనే పట్టుదలతో సీఎం చంద్రబాబు ఉన్నారని అన్నారు.
ఎన్నికల హామీల్లో మహిళల కోసం చాలా పథకాలు పొందుపరిచామని చెప్పారు. గత జగన్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్లిపోయిందని విమర్శలు చేశారు.మున్సిపాలిటీల్లో బ్లీచింగ్‌కు కూడా డబ్బులు లేకుండా చేశారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క హామీని అమలు చేస్తూ వస్తున్నామని అన్నారు. ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను పంపిణీ చేస్తున్నామని గుర్తుచేశారు. మహిళలకు త్వరలోనే ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రారంభిస్తామని చెప్పారు. తల్లికి వందనం ద్వారా ప్రతి విద్యార్థికి రూ.15వేల చొప్పున తల్లుల ఖాతాల్లో మే లోగా జమ చేస్తామని మంత్రి నారాయణ అన్నారు.
డ్వాక్రా సంఘాల వల్ల మహిళల్లో చైతన్యం: మంత్రి అచ్చెన్నాయుడు
అంబేద్కర్ కోనసీమ(అమలాపురం): డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం వల్ల మహిళల్లో చైతన్యం వచ్చిందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. మహిళలకు డ్వాక్రా సంఘాలను చంద్రబాబు ప్రవేశపెట్టిన్నప్పుడు అందరూ విమర్శించారని అన్నారు. ఇవాళ(శనివారం) అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... మహిళలు జీవితాంతం గుర్తుపెట్టుకోవలసిన వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.
ఈరోజు ఏపీలో పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పారు. దేశంలోనే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని.. అది డొక్కా సీతమ్మ వల్ల వచ్చిందని గుర్తుచేశారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఏదిగే విధంగా కుటమి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ పథకాల ద్వారా 12 లక్షల మంది మహిళలకు రూ.4 వేల కోట్లు ఆర్థిక సహాయం పంపిణీ చేస్తున్నామని చెప్పారు. యువనాయికుడు లోకేష్ నాయకత్వంలో వాట్సాప్ గవర్నెన్స్ వచ్చిందని ఉద్గాటించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాట్సాప్ ద్వారానే 200 ప్రభుత్వ సేవలు ప్రజలు వినియోగించుకుంటున్నారని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ
Venkaiah Naidu: ఉన్నత విద్యలో మార్పుతోనే దొరస్వామికి నివాళి
Power Tariff: విద్యుత్ ట్రూ అప్ పాపం వైసీపీదే
Read Latest AP News and Telugu News