Nara Lokesh: ఏఐతో ఉద్యోగాలు.. మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 23 , 2025 | 02:27 PM
క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఎవ్వరూ క్వాంటమ్ గురించి మాట్లాడనప్పుడు తాము క్వాంటమ్ కంప్యూటింగ్ యూస్ కేసుల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాకథాన్‌లు నిర్వహిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మన మిత్ర ద్వారా మెరుగైన సేవలను కూటమి ప్రభుత్వం అందిస్తోందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. గతంలో ఎయిర్‌పోర్ట్ ఎలా ఒక ప్రాంతం రూపురేఖలు మార్చిందో చూశామని తెలిపారు. తెలంగాణ జీడీపీలో ఎయిర్‌పోర్ట్ వల్ల ఆదాయం 17శాతం నుంచి 18శాతానికి పెరిగిందని వివరించారు. ఏపీలో పెట్టుబడులు ప్రోత్సహించడమే లక్ష్యంగా పారిశ్రామిక వేత్తలతో ఇవాళ(బుధవారం, జులై 23) విజయవాడలో సమ్మిట్ నిర్వహించారు. యూఏఈ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. భారత్- యూఏఈ ఆర్థిక సంబంధాల బలోపేతంపై మంత్రి నారా లోకేష్ ఈ సదస్సులో ప్రసంగించారు.
క్వాంటమ్ కంప్యూటింగ్ అమరావతిలో గేమ్ చేంజర్ అవుతుందని మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. ఎవ్వరూ క్వాంటమ్ గురించి మాట్లాడనప్పుడు తాము క్వాంటమ్ యూజ్ కేసుల గురించి మాట్లాడుతున్నామని తెలిపారు. ఏఐ మంత్రిని కలిగి ఉన్నా మొదటి దేశం యూఏఈ అని వెల్లడించారు. ఏపీ ఇప్పుడు ఏఐని అడాప్ట్ చేసుకుని హ్యాకథాన్‌లు నిర్వహిస్తోందని వ్యాఖ్యానించారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని కొంతమందిలో ఆందోళన ఉందని.. అయితే పారిశ్రామిక విప్లవం మరిన్ని ఉద్యోగాలు తెచ్చిందని అన్నారు. అలా ఏఐ కూడా చాలా ఉద్యోగాలు తెస్తోందని.. ఏఐ మనకు వే ఆఫ్ లైఫ్ అని చెప్పారు. దీన్ని బేసిక్ డ్రాఫ్టింగ్‌కు వాడతానని చెప్పుకొచ్చారు లోకేశ్. ఈ సమావేశం సారాంశాన్ని సమ్మరైజ్ చేయడానికి ఏఐని ఉపయోగిస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు
వచ్చే 3 రోజులు అతి భారీ వర్షాలు
Read latest AP News And Telugu News