Share News

Nara Lokesh: విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యం: లోకేష్‌

ABN , Publish Date - Jun 23 , 2025 | 03:18 PM

గురువులు దేవుడితో సమానమని.. అందరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.

Nara Lokesh: విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యం: లోకేష్‌
Minister Nara Lokesh

బాపట్ల: నాణ్యమైన విద్యా, ఉపాధి కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ (Minister Nara Lokesh) ఉద్ఘాటించారు. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని వ్యాఖ్యానించారు. ఇవాళ(సోమవారం) బాపట్ల జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఇంకొల్లు వద్ద డీవీఆర్ సైనిక్ స్కూల్‌ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు.


గురువులు దేవుడితో సమానమని.. అందరిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. తల్లులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పహల్గామ్‌లో అన్యాయంగా భారత పర్యాటకులను పాకిస్థాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ టెర్రరిస్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సరైన గుణపాఠం చెప్పారని అన్నారు మంత్రి నారా లోకేష్‌.


సైనికులను జాగ్రత్తగా చూసుకుని వారిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నారా లోకేష్‌ తెలిపారు. మనకు పరీక్షలు పెట్టే దేవుడే.. వాటిని జయించే శక్తిని కూడా ఇస్తారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం 20 సంవత్సరాల పాటు మంగళగిరిలో గెలవలేదని అన్నారు. తాను కూడా మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయానని... ఆ తర్వాత ఐదేళ్లు కష్టపడి అత్యధిక మెజార్టీతో గెలిచానని గుర్తుచేశారు. తాను ఓడిపోయినప్పుడు ఎందరో హేళన చేశారని.. కానీ తాను బాధపడలేదు...గెలిచి చూపించానని ఉద్ఘాటించారు. ఎవరూ నిరుత్సాహపడొద్దు.. విజయం సాధించి చూపించాలని మంత్రి నారా లోకేష్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి:

దూకుడు పెంచిన సిట్.. మాజీ సీఎస్ కీలక వాంగ్మూలం

యూఎస్‌ను హెచ్చరించిన ఇరాన్

For More Andhrapradesh News and Telugu News

Updated Date - Jun 23 , 2025 | 03:26 PM