Minister Parthasarathy: భయం, ఫ్రస్టేషన్‌తోనే దిగజారి మాట్లాడుతున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి పార్థసారథి ఫైర్
ABN , Publish Date - Aug 03 , 2025 | 04:20 PM
జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా అని మంత్రి కొలుసు పార్థసారథి ప్రశ్నించారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి (Minister Kolusu Parthasarathy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను చూసి జగన్‌లో ఫ్రస్టేషన్ పెరిగిపోతోందని విమర్శించారు. భయం, ఫ్రస్టేషన్‌తోనే దిగజారి జగన్ అండ్ కో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయనలో భయం బయట పడుతోందని ఎద్దేవా చేశారు. తాను ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని.. జగన్ లాంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఇవాళ(ఆదివారం) అమరావతి వేదికగా మంత్రి కొలుసు పార్థసారథి మీడియాతో మాట్లాడారు. గతంలో గెలిచినా, ఓడినా నాయకులు ప్రజా సమస్యలపై హుందాగా మాట్లాడేవారని.. వారు వ్యక్తిగత దూషణలను ప్రోత్సహించేవారు కాదని స్పష్టం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.
జగన్ ఇందుకు పూర్తిగా విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. జగన్ తన వ్యాఖ్యల ద్వారా సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. రౌడీలు, గంజాయి స్మగ్లర్లు, బెట్టింగ్ రాయుళ్ల ఇళ్లకు జగన్ వెళ్లడం పరామర్శా? ఎలా అవుతోందని నిలదీశారు. ఇలాంటి పరామర్శలు జగన్ చేయడం అంటే వైసీపీ ఉనికిలో ఉందని చెప్పుకోవడానికే కదా? అని ప్రశ్నించారు. ప్రతివర్గాన్ని నిలబెట్టేలా కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని.. అందుకే రాజకీయ మనుగడకోసం జగన్ చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కొలుసు పార్థసారథి.
గతంలో కంటే రెట్టింపు సంక్షేమాన్ని తమ ప్రభుత్వం అందజేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. తమ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలే జగన్‌లో ఫ్రస్టేషన్‌కు కారణం కావచ్చని చెప్పుకొచ్చారు. ప్రజలను డైవర్ట్ చేసేందుకు డైవర్షన్ పాలిటిక్స్‌తో జగన్ గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ నెలతో రూ.40 వేల కోట్లు కేవలం పింఛన్లపై తమ ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. 204 అన్నా క్యాంటీన్లు తెరిచామని, అన్నదాతల అకౌంట్లలో రూ.3,200 కోట్లు జమ చేశామని తెలిపారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు అమలు చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటి వరకు 16 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం, ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని నిలబెట్టామని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
లిక్కర్ స్కాం నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. మంత్రి టీజీ భరత్..
For More AP News and Telugu News