Share News

Minister Anagani : క్షేత్రస్థాయిలో విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Mar 09 , 2025 | 02:33 PM

Minister Anagani Sathya Prasad : విద్యారంగాన్ని విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

Minister Anagani : క్షేత్రస్థాయిలో విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి
Minister Anagani Sathya Prasad

బాపట్ల జిల్లా: మారుమూల ప్రాంతాల్లో విద్యా వ్యాప్తికి ప్రభుత్వ కళాశాలలు అవసరమని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇవాళ(ఆదివారం) రేపల్లెలో ప్రభుత్వ నూతన పాలిటెక్నిక్ కళాశాల భవనాలను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఈ పాలిటెక్నిక్ కళాశాలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని మాటిచ్చారు. అవసరమైతే సీఎస్ఆర్ నిధులు తీసుకొచ్చి పాలిటెక్నిక్ కళాశాలను అభివృద్ధి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ హామీ ఇచ్చారు.


విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయి నుంచి విద్యారంగాన్ని బలోపేతం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ప్రతి క్లాసుకు ఒక టీచర్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల మధ్య సమన్వయం కోసం పేరేంట్ టీచర్స్ మీటింగ్ నిర్వహించారని చెప్పారు. విద్యార్థుల అభ్యున్నతి కోసం బుక్స్, దుస్తులు, షూస్, బ్యాగులు అన్నీ ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని సూచించారు. జీవితంలో కీలక దశలో ఉన్న పాలిటెక్నిట్ విద్యార్థులు ఇప్పుడే తమ జీవితానికంటూ లక్ష్యాన్ని ఏర్పరుచుకోవాలని సూచించారు. లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ విద్యా రంగానికి సీఎం చంద్రబాబు అవసరమైన నిధులను కేటాయిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

Anil Video: బోరుగడ్డ అనిల్ వీడియోపై పోలీసుల సీరియస్

Arasavelli: అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి భక్తులకు తీవ్ర నిరాశ

Minister Ram Prasad : క్రీడాభివృద్ధికి సహకరించండి

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 09 , 2025 | 02:48 PM