Home Minister Anitha: 2019 నుంచి ఏపీలో ఎమర్జెన్సీ పాలనే నడిచింది: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Jun 25 , 2025 | 07:42 PM
గంజాయిపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా, కొనుగోలుని అడ్డుకుంటున్నామని హోంమంత్రి అనిత తెలిపారు.

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Vangalapudi Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ మూకలు ఇంకోసారి రప్పా రప్పా అంటే ప్రజలు ఎదురు తిరిగి కొడతారని హెచ్చరించారు. జగన్ అతని బ్యాచ్ ఆటలు ఇకపై సాగవని వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ(బుధవారం) ఏపీ సచివాలయంలో హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనతో ముగ్గురు ప్రాణాలను తీశారని ఫైర్ అయ్యారు. అంబులెన్స్ సైరన్ వినిపిస్తే చిన్న పిల్లలు కూడా పక్కకు తప్పుకుంటారని.. కానీ జగన్ తన కాన్వాయ్‌ని రోడ్డు మీదనే ఉంచడంతో అన్యాయంగా ఓ యువకుడు ప్రాణం కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రచార పిచ్చితో మధు అనే యువకుడి ప్రాణం పోయిందని అన్నారు. ఆ రోజు అంబులెన్స్‌కు దారి ఇచ్చి ఉంటే మధు బతికేవారని తెలిపారు హోం మంత్రి అనిత.
ప్రాణాలు తీస్తుంటే ఊరుకోవాలా..
పోలీసుల సూచనలు సైతం పెడచెవిన పెట్టి మరీ మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఊరుకోవాలా అని హోం మంత్రి అనిత ప్రశ్నించారు. మైండ్ గేమ్‌లతో వైసీపీ మూకలు చేస్తున్న కుట్రలపై ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని చెప్పారు. జగన్ తాలూకూ సైకో నైజాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. విధ్వంసం, విద్వేషానికి బ్రాoడ్ అంబాసిడర్ జగన్ అని ఆరోపించారు. ఎక్కడ ఎవరూ చనిపోతారా అని ఎదురు చూస్తున్న ఆయన స్వభావం అందరికీ అర్ధమవుతోందని చెప్పుకొచ్చారు హోం మంత్రి అనిత.
విధ్వంసాలను రెచ్చగొడుతున్నారు...
ఎమర్జెన్సీ విధించిన రోజునే జగన్ ప్రజావేదిక కూల్చారని హోం మంత్రి అనిత మండిపడ్డారు. విధ్వంసాలను మళ్లీ రెచ్చగొట్టేందుకు జగన్ సిద్ధమవుతున్నారని ధ్వజమెత్తారు. 2019 నుంచి రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలనే నడిచిందని ఆక్షేపించారు. ఇప్పుడు నీతులు చెబుతున్న జగన్‌కు గత ఐదేళ్ల విధ్వంసాన్ని అతనికే గుర్తు చేయాలని అన్నారు. నోటి పారుదల శాఖ నుంచి అంబటి రాంబాబు ఇంకా బయటకు రానట్లున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు.
గంజాయిపై ఉక్కుపాదం..
అంతకుముందు... సీఎం చంద్రబాబు గుంటూరు పర్యటన ఏర్పాట్లను హోం మంత్రి అనిత, ఎమ్మెల్యేలు నసీర్, మాధవి పరిశీలించారు. ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్‌లో హెలీప్యాడ్ వద్ద ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు హోం మంత్రి అనిత. గంజాయిపై తమ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని అన్నారు. ఈగల్ టీం ఏర్పాటు చేసి గంజాయి రవాణా, కొనుగోలుని అడ్డుకుంటున్నామని తెలిపారు. గుంటూరులో రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటిస్తారని చెప్పారు హోం మంత్రి అనిత.
ఈ సందర్భంగా 26, 27వ తేదీల్లో గుంటూరులో సీఎం చంద్రబాబు పర్యటిస్తారని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 26వ తేదీన యాంటీ నార్కోటిక్ డే కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. శ్రీ కన్వెన్షన్‌లో యువత, విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగంపై జరిగే నష్టాల గురించి సమావేశం జరుగుతుందని తెలిపారు. రేపు (గురువారం) ఫీవర్ ఆస్పత్రి నుంచి చిల్లీస్ సెంటర్ వరకు యాంటీ నార్కోటిక్ ర్యాలీ నిర్వహిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేంద్ర కేబినెట్‌లో చంద్రబాబు, లోకేష్‌ను మెచ్చుకున్న ప్రధాని
ప్రతీ కార్యకర్తను గౌరవిస్తాం: మంత్రి కొల్లు
Read latest AP News And Telugu News