Share News

Minister Nara Lokesh: డిసెంబర్ 6న డాలస్‌‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన.. సభ కోసం భారీ ప్లానింగ్

ABN , Publish Date - Nov 10 , 2025 | 07:13 AM

ఏపీ మంత్రి నారా లోకేష్ డిసెంబర్ 6వ తేదీన డాలస్‌‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా లోకేష్ కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. యువనేత సభ కోసం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు ప్లాన్ చేస్తున్నారు.

Minister Nara Lokesh: డిసెంబర్ 6న డాలస్‌‌లో మంత్రి నారా లోకేష్  పర్యటన.. సభ  కోసం భారీ ప్లానింగ్
Minister Nara Lokesh

అమరావతి, నవంబరు10(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) డిసెంబర్ 6వ తేదీన డాలస్‌లో పర్యటించనున్నారు. యువనేత పర్యటన సందర్భంగా పదివేలమంది ప్రవాస తెలుగువారితో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న(ఆదివారం) సాయంత్రం డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యుల సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో వందమందికి పైగా సభ్యులు పాల్గొన్నారు. మంత్రి లోకేష్ డాలస్ సభ ఏర్పాట్లను సజావుగా నిర్వహించాలని ఓ కార్యచరణ రూపొందించారు ఎన్నారై టీడీపీ సభ్యులు. లోకేష్ సభ కోసం ఒక స్టీరింగ్ కమిటీ, వారితో అనుసంధానం చేసుకుంటూ సెక్యూరిటీ, భోజనాలు, స్వాగతసన్నాహకాలు, వేదిక ఏర్పాట్లు వంటి ఒక్కో బాధ్యతను నిర్వహించేందుకు ఇతర కమిటీలు ఏర్పాటు చేశారు. ఈ కమిటీల్లో పాలుపంచుకునేందుకు కొందరు సభ్యులు తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ పేర్లు నమోదు చేసుకున్నారు. నిన్నటి సమావేశానికి హాజరు కాలేకపోయిన ఇతర సభ్యులు, కింద జత చేసిన లింక్ ద్వారా మీకు ఆసక్తి ఉన్న ఈ కమిటీల్లో వారి పేరు, కాంటాక్ట్ వివరాలు పొందుపరచవచ్చని డాలస్ ఎన్నారై టీడీపీ సభ్యులు సూచించారు. ఈ క్రమంలోనే స్టీరింగ్ కమిటీ సభ్యులుగా పలువురిని నియమించారు.


స్టీరింగ్ కమిటీ సభ్యులుగా..

సుధీర్ చింతమనేని, చంద్రశేఖర్ కాజా, నవీన్ యర్రంనేని, రామకృష్ణ గుళ్లపల్లి, కిషోర్ చలసాని, లోకేష్ కొణిదల, దిలీప్ చంద్ర, పూర్ణ గరిమెళ్ల, అమర్ అన్నే, అనిల్ తన్నీరు ఉన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలి.. ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్ హయాంలో సహకార, వ్యవసాయ పరపతి సంఘాల్లో అవినీతికి పాల్పడ్డారు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 10 , 2025 | 07:46 AM