Share News

CM Chandrababu On London: సీఎం చంద్రబాబు లండన్‌ పర్యటన.. పూర్తి వివరాలివే..

ABN , Publish Date - Oct 29 , 2025 | 07:16 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన చేయనున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది.

CM Chandrababu On London: సీఎం చంద్రబాబు లండన్‌ పర్యటన.. పూర్తి వివరాలివే..
CM Chandrababu On London

అమరావతి, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) విదేశీ పర్యటన చేయనున్నారు. నవంబరు 2వ తేదీ నుంచి సీఎం చంద్రబాబు లండన్‌ (London)లో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారైంది. ఏపీకి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పర్యటన కొనసాగనుంది.


ఈ క్రమంలో విశాఖపట్నంలో నవంబరులో జరగనున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు సీఎం చంద్రబాబు. లండన్‌లో రోడ్డు షోతో పాటు సీఐఐ సమావేశంలో సీఎం పాల్గొననున్నారు. లండన్ నుంచి మళ్లీ తిరిగి నవంబర్ 6వ తేదీన అమరావతికి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి...

రాబోయే నాలుగు రోజులు చాలా కీలకమైనవి: మంత్రి సత్యకుమార్

మొంథా తుఫాను ప్రమాదం తప్పింది.. కానీ చాలా నష్టపోయాం..

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 07:44 PM