Share News

Minister Kandula Durgesh: ఏపీ లిక్కర్‌ స్కాంలో మొత్తం డొంక కదులుతోంది

ABN , Publish Date - Aug 03 , 2025 | 09:19 PM

అత్యుత్తమ విధానాలతో ఏపీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీ చాలా బాగుందని మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ ఉద్ఘాటించారు.

Minister Kandula Durgesh: ఏపీ లిక్కర్‌ స్కాంలో మొత్తం డొంక కదులుతోంది
Minister Kandula Durgesh

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ (Minister Kandula Durgesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన వైసీపీకి దిమ్మదిరిగే షాక్ తగిలిందని చెప్పుకొచ్చారు. లిక్కర్ స్కామ్‌లో కదులుతున్న డొంకతో వైసీపీ నేతల నిజస్వరూపం బయటపడుతోందని విమర్శించారు. లిక్కర్ స్కామ్‌లో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుందని పేర్కొన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతల మైండ్ బ్లాక్ అయిందని ఎద్దేవా చేశారు మంత్రి కందుల దుర్గేష్.


ఇవాళ(ఆదివారం) అమరావతి వేదికగా మంత్రి కందుల దుర్గేష్ మీడియాతో మాట్లాడారు. లిక్కర్ దందాతో బ్రాండెడ్ మద్యం ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిన జగన్ అండ్ కో నిద్రల్లేని రాత్రులు గడుపుతున్నారని ఆక్షేపించారు. అత్యుత్తమ విధానాలతో ఏపీలో తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీ చాలా బాగుందని ప్రశంసించారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు నాణ్యమైన మద్యం అందిస్తున్నామని ఉద్ఘాటించారు. మద్యం డిపోల నిర్వహణ, ట్రాక్ అండ్ ట్రేస్ విధానం, మద్యం సరఫరా ఆర్డర్ల జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ అండ్ కోవి డైవర్షన్ పాలిటిక్స్.. మంత్రి పార్థసారథి ఫైర్

ఎల్వీ సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలను ఖండించిన టీటీడీ చైర్మన్

For More AP News and Telugu News

Updated Date - Aug 03 , 2025 | 09:23 PM