Share News

AP High Court: పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Dec 04 , 2025 | 08:25 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పరకామణి చోరీ కేసుపై గురువారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

AP High Court: పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
AP High Court

అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో(Andhra Pradesh High Court) పరకామణి చోరీ కేసుపై (Parakamani Theft Case) ఇవాళ(గురువారం) విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసుపై వాదనలు జరిగాయి. అనంతరం ఈ కేసుపై న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్ జడ్జ్ ఉత్తర్వుల్లో తప్పు ఏముందని ప్రశ్నించింది. అది ప్రాథమిక అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది. లోక్ అదాలత్ ఉత్తర్వుల చట్టబద్దతను తేల్చే అర్హతను ధర్మాసనానికి నివేదించింది. దేవాలయాల ప్రయోజనాలను కాపాడే విషయంలో మొదటి సంరక్షకులు న్యాయస్థానాలేనని వ్యాఖ్యానించింది హైకోర్టు.


పరకామణి చోరీ కేసులో రవి కుమార్ అప్పీల్‌పై విచారణ ఈ నెల 11వ తేదీకు వాయిదా వేసింది. ఈకేసును లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకోవడం చిన్న విషయం కాదని నిందితుడి రవి కుమార్‌తో అప్పటి ఏవీఎస్వో సతీశ్ కుమార్ కేసు లోక్ అదాలత్ వద్ద రాజీ చేసుకునే అవకాశం లేదని మాత్రమే సింగిల్ జడ్జ్ పేర్కొన్నారని గుర్తుచేసింది ధర్మాసనం. ఈ క్రమంలో సింగిల్ జడ్జ్ ఉత్తర్వులపై డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించారు రవికుమార్.


ఈ వార్తలు కూడా చదవండి

'తెలుగు చదువుకుంటేనే ఉద్యోగం'.. వెంకయ్యనాయిడు కీలక వ్యాఖ్యలు!

పదవి పోయిన తర్వాత ఏపీలో ఎన్ని రోజులు ఉన్నావ్ జగన్: అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 04 , 2025 | 08:30 PM