Amaravati Farmers: అమరావతి రైల్వేలైన్‌కు భూములివ్వటంపై రైతులు ఏమన్నారంటే..
ABN , Publish Date - Jul 22 , 2025 | 07:28 PM
అమరావతి రైల్వే లైన్‌కు భూములివ్వటానికి తాము సిద్ధమని రైతులు స్పష్టం చేశారు. అయితే ఎంత నష్ట పరిహారం ఇస్తారు, భూ సమీకరణలో భూములు తీసుకుంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడిస్తారో స్పష్టంగా ప్రకటన చేయాలని సూచించారు. స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని అమరావతి రైతులు కోరారు.

గుంటూరు: అమరావతి రైల్వేలైన్ (Amaravati Railway Line) భూసేకరణకి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు కొప్పురావూరికి చెందిన కొంతమంది రైతులు. ధ్రువీకరణ పత్రాలతో జాయింట్ కలెక్టర్ ఎదుట హాజరు కావాలని అభ్యంతరాలు వ్యక్తం చేసిన రైతులకు నోటీసులు ఇచ్చారు. ఈరోజు(మంగళవారం) జాయింట్ కలెక్టర్ ఎదుట రైతులు హాజరయ్యారు. రైతుల అభ్యంతరాలను జాయింట్ కలెక్టర్ నమోదు చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో అమరావతి రైతులు (Amaravati Farmers) మాట్లాడారు. అమరావతి రైల్వేలైన్‌కు భూములివ్వటానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. అయితే ఎంత నష్టపరిహారం ఇస్తారు, భూ సమీకరణలో భూములు తీసుకుంటే రిటర్నబుల్ ప్లాట్స్ ఎక్కడిస్తారో స్పష్టంగా ప్రకటన చేయాలని సూచించారు. స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని కోరారు. కొన్నిప్రాంతాల్లో డబుల్ రిజిస్ట్రేషన్లు జరిగాయని చెప్పుకొచ్చారు. న్యాయపరమైన చిక్కులు ఉన్న చోట నిజమైన భూ యజమానిని గుర్తించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామని అన్నారు. ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని అమరావతి రైతులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలు
వేల కోట్ల భూములు.. ఖరీదైన విల్లాలు.. వెలుగులోకి మాజీ మంత్రి అనిల్ అక్రమాలు
For More AP News and Telugu News