Share News

Perni Nani: అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..

ABN , Publish Date - Jul 21 , 2025 | 11:55 AM

రప్పా రప్పా అని చెప్పడం కాదు.. . రాత్రికి రాత్రి చేసేయాలంటూ.. పామర్రులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Perni Nani: అజ్ఞాతంలోకి పేర్ని నాని.. గాలిస్తున్న పోలీసులు..
Perni Nani

అమరావతి: జులై 8న పామర్రులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని రప్పా రప్పా అంటూ కొట్టిన డైలాగులు ఇంకా ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఓ కల్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రప్పా రప్పా అని చెప్పడం కాదు.. రాత్రికి రాత్రి చేసేయాలంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. హైకోర్టులోనూ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా చుక్కెదురు కావడంతో పేర్ని నాని ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం గాలిస్తున్న ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.


సైలెంట్‌గా అజ్ఞాతంలోకి..

రప్పా.. రప్పా.. అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై కృష్ణా జిల్లా పామర్రు పీఎస్ లో టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పోలీస్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. పామర్రు కేసును కొట్టివేయాలంటూ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు పేర్ని నాని విజ్ఞప్తిని తోసిపుచ్చుతూ తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. అరెస్టు నుంచి ముందస్తు రక్షణ దక్కలేదని ఖంగుతిన్న పేర్ని నాని సైలెంట్‌గా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈనెల 22న హైకోర్టు విచారణ తరువాత పేర్ని నాని వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.


ఈ వార్తలు కూడా చదవండి..

విచారణకు హాజరు కాలేను: మాజీ మంత్రి నారాయణ స్వామి

అభివృద్ధి పేరుతో పొలాలు లాక్కోవద్దు

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 12:12 PM