Share News

Banakacherla Project: బనకచర్ల సాంకేతిక కమిటీలోకి రాష్ట్రం నుంచి ముగ్గురు

ABN , Publish Date - Jul 21 , 2025 | 06:05 AM

పోలవరం బనకచర్ల అనుసంధాన పథకంపై అధ్యయనం కోసం కేంద్ర జలశక్తి శాఖ వేయనున్న..

Banakacherla Project: బనకచర్ల సాంకేతిక కమిటీలోకి రాష్ట్రం నుంచి ముగ్గురు
Banakacherla Project

  • పేర్లు పంపాలంటూ కేంద్రజలశక్తి శాఖ లేఖ

అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకంపై అధ్యయనం కోసం కేంద్ర జలశక్తి శాఖ వేయనున్న 12 మందితో కూడిన సాంకేతిక, నిపుణుల కమిటీలోకి రాష్ట్రం నుంచి ముగ్గురు అధికారుల పేర్లను ప్రతిపాదించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ పథకంపై అధ్యయనం కోసం కమిటీని వేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్‌రెడ్డితో నిర్వహించిన సమావేశం తీర్మానించింది. ఈ నేపథ్యంలో కమిటీలో నియమించే సభ్యుల పేర్లను ప్రతిపాదించాలని ఇరు రాష్ట్రాలను కోరుతూ కేంద్ర జలశక్తిశాఖ శనివారం లేఖ పంపింది. దీంతో ఈ పథకంపై సంపూర్ణ అవగాహన కలిగిన జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌, ఆ శాఖ సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఆ శాఖ ఇంజనీర్‌ ఇన్‌చీ్‌ఫ నరసింహమూర్తి పేర్లను మంగళవారం నాటికి అధికారికంగా ఖరారు చేసి పంపాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. కాగా, పోలవరం ప్రాజెక్టు బృందం ఆదివారం రాజమండ్రికి చేరుకుంది. సోమవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఈ బృందం పర్యటించి, జలాలపై అధ్యయనం చేయనుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు

ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 21 , 2025 | 06:05 AM