Share News

Womens day: మహిళలు రాజకీయాల్లో రాణించాలి.. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 08 , 2025 | 09:46 AM

Srinivas Varma: మహిళా దినోత్సవం సందర్భంగా శనివారం భీమవరంలో 2కే వాక్ జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొన్నారు. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Womens day: మహిళలు రాజకీయాల్లో  రాణించాలి.. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు
Womens day Wishes

పశ్చిమ గోదావరి: రాబోయే రోజుల్లో మహిళలు సమాజంలో, రాజకీయాల్లో అవగాహన పెంచుకుని రాణించాలని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వ్యాఖ్యానించారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళను ఆదిపరాశక్తిగా పూజించేది ఒక్క భారతదేశ సంస్కృతిలోనే అని.. భారతదేశంలో పుట్టిన ప్రతీ మహిళా అందుకు గర్వపడాలని ఉద్ఘాటించారు. చట్టసభల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లు చట్టం ఆమోదించామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు.


మహిళలను దేవతల్లా చూసుకోవాలి: రఘురామకృష్ణంరాజు

raghuram.jpg మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ(శనివారం) భీమవరంలో 2కే వాక్ జరిగింది. ప్రకాశం చౌక్ నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకూ వేలాది మందితో వాక్ నిర్వహించారు. 2కే వాక్‌లో జిల్లా కలెక్టర్ నాగరాణి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ గోపిమూర్తి పాల్గొన్నారు. మహిళామణులు అందరికీ రఘురామ కృష్ణంరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడారు. ఆలయాలకు వెళ్తే దేవతలను పూజిస్తామని.. కానీ ఇంటికి వెళ్తే అందుకు భిన్నంగా కొందరు ప్రవర్తిస్తారని అన్నారు. ఇంట్లో కూడా మహిళలను దేవతల్లా చూసుకోవాలని చెప్పారు. ఈ ఒక్కరోజైనా ఇంట్లో సగం పని మహిళలతో షేర్ చేసుకోవాలని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Chandrababu Naidu: మహిళా పారిశ్రామికవేత్తల హబ్‌గా ఏపీ

Venkaiah Naidu: ఉన్నత విద్యలో మార్పుతోనే దొరస్వామికి నివాళి

Power Tariff: విద్యుత్‌ ట్రూ అప్‌ పాపం వైసీపీదే

Read Latest AP News and Telugu News

Updated Date - Mar 08 , 2025 | 09:50 AM