Purandeswari: ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి అరుదైన పురస్కారం
ABN , Publish Date - Nov 15 , 2025 | 10:49 AM
గోదావరి పుష్కరాలపై అధికారులతో రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు.
రాజమండ్రి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కామన్ హెల్త్ మహిళా సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొన్నానని రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి (BJP MP Daggubati Purandeswari) వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మాట్లాడటం తన అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ సదస్సులో తనకు రెండు అరుదైన గౌరవాలు లభించాయని ఉద్ఘాటించారు. ఇవాళ(శనివారం) రాజమండ్రిలో పురందేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
అణుశక్తి కి సంబంధించి అణుబాంబులు తయారు చేయాలని భారతదేశం ప్రకటించిందని గుర్తుచేశారు. బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధించటం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని వివరించారు. పొగాకు రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో తాను మాట్లాడానని తెలిపారు.
కొవ్వూరులో రెండు రైళ్లు, అనపర్తిలో జన్మభూమి రైలు హాల్ట్ సాధించామని నొక్కిచెప్పారు. మొంథా తుఫాను ప్రభావంతో వాటిల్లిన నష్టంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడానని పేర్కొన్నారు. అలాగే, గోదావరి పుష్కరాలపై అధికారులతో చర్చించారు. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి పుష్కరాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ మద్యం కుంభకోణం.. అనిల్ చోకరా అరెస్ట్
ఆర్ఐ సతీష్ కుమార్ హత్య కేసు.. ఏబీఎన్ చేతిలో ఎఫ్‌ఐఆర్ కాపీ
Read Latest AP News And Telugu News