Srivari Darshan Tickets: శ్రీవారి దర్శన టిక్కెట్లకు భారీ డిమాండ్
ABN , Publish Date - Apr 24 , 2025 | 01:41 PM
Srivari Darshan Tickets: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దర్శించుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటీపడుతుంటారు. అయితే దేవుడిని దర్శించుకునే విషయంలో టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.

తిరుమల: శ్రీవారి దర్శన టిక్కెట్లకు భక్తుల నుంచి డిమాండ్ పెరుగుతోంది. జులై నెలకు సంబంధించిన టిక్కెట్లను ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టిక్కెట్లను గంట నాలుగు నిమిషాల వ్యవధిలో భక్తులు కొనుగోలు చేశారు. అంగప్రదక్షిణ టోకెన్‌లని రెండు నిమిషాల్లోనే.. వయోవృద్ధులు, వికలాంగుల కోటా టికెట్లను 9 నిమిషాల్లోనే కొనుగోలు చేశారు. రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను 58 నిమిషాల్లో భక్తులు దక్కించుకున్నారు.
కాగా.. ప్రపంచవ్యాప్తంగా భక్తులు భారీ సంఖ్యలో తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటీపడుతుంటారు. జులై నెలకు సంబంధించిన టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేయగానే వెంటనే అయిపోయాయి. స్వామివారిని దర్శించుకునే విషయంలో టికెట్ల సంఖ్యను మరింతగా పెంచాలని భక్తులు కోరుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వస్తుంటామని భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని టికెట్ల కోటాను ఇంకా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. లేదా స్వామివారి దర్శనం కోసం ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. స్వామి వారిని దర్శించుకుంటే తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తున్నారు. వేసవి నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీవారి కొండపై టీటీడీ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Narayana: ప్రధాని ఏపీ పర్యటన.. అధికారులకు మంత్రి నారాయణ సూచనలు
ACB: మాజీ మంత్రి విడదల రజని మరిది అరెస్టు..
Terror Attack: ఉగ్రదాడిలో అసువులుబాసిన నెల్లూరు జిల్లా వాసి.. మరికాసేపట్లో కావలికి మృతదేహం..
For More AP News and Telugu News