AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jul 03 , 2025 | 09:08 AM
ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. గురువారం కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రాజెక్ట్‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు.

చిత్తూరు: ప్రతి ఒక్కరికీ ఆరోగ్యమే పరిరక్షణ ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Govt) మరో కొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా కుప్పం నియోజకవర్గంలో అమలు చేయనుంది. ఇవాళ(గురువారం) కుప్పం ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ప్రాజెక్ట్‌ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) ప్రారంభించనున్నారు. టాటా కంపెనీ సహకారంతో డిజిటల్ సర్వే సెంటర్‌ని చంద్రబాబు ప్రారంభించనున్నారు.
కుప్పం నియోజకవర్గంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ట్రీట్‌మెంట్ కోసం వచ్చే రోగుల డేటాను డిజిటల్ రూపంలో టాటా కంపెనీ పొందుపరచనుంది. రోగులకు వ్యాధులపరంగా డేటా నమోదు చేయడంతో పాటు భవిష్యత్తులో వారి ట్రీట్‌మెంట్ కోసం ఇది ఎంతో ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కుప్పంలో ఈ పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే ఏపీవ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది.
మరోవైపు.. కుప్పం నియోజకవర్గంలో రెండోరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. ఉదయం 10:30 గంటలకు కుప్పం ఏరియా హాస్పిటల్‌కి చేరుకొని టాటా డిజిటల్ సర్వే సెంటర్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు ముఖ్యమంత్రి స్వగృహానికి చేరుకొని అధికారిక సమీక్షలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను ముగించుకొని సాయంత్రం 4:10 గంటలకు తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కి చేరుకుని బెంగళూరుకి చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు.
ఇవి కూడా చదవండి:
ఉద్యోగులకు ఉచిత వసతి పొడిగింపు
రాష్ట్రంలో లక్ష సీసీ కెమెరాలు ఏర్పాటు
For More AP News and Telugu News