Share News

CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..

ABN , Publish Date - Jul 02 , 2025 | 07:16 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాలు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

CM Chandrababu: కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..
AP CM Nara Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) రెండు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో (Kuppam Constituency) పర్యటించనున్నారు. బుధ, గురువారాలు కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలం తుంసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 12:50 గంటలకు తుంసిలోని ఏపీ మోడల్ స్కూల్ ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.


అనంతరం పలు పరిశ్రమల యాజమాన్యాలతో ఎంఓయూలు కుదుర్చుకోవడం, వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలిస్తారు. బహిరంగ సభ అనంతరం సాయంత్రం 4:30 గంటలకు శాంతిపురం మండలం తిమ్మరాజుపల్లికి చేరుకొని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనుల గురించి ముఖ్యమంత్రి వివరించనున్నారు. సాయంత్రం 7:05 గంటలకు కుప్పలోని తన నివాసానికి చేరుకొని రాత్రి బస చేస్తారు. రేపు (గురువారం) ఉదయం 10:30 గంటలకు కుప్పం ఏరియా హాస్పిటల్‌కి చేరుకొని టాటా డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:15 గంటలకు ముఖ్యమంత్రి స్వగృహానికి చేరుకొని అధికారిక సమీక్షలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్ని ముగించుకొని సాయంత్రం 4:10 గంటలకు తుమ్మిసి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కి చేరుకుని.. అక్కడి నుంచి బెంగళూరు‌కి సీఎం చంద్రబాబు తిరుగు ప్రయాణం అవుతారు.


అలాగే.. ఏపీవ్యాప్తంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు(జులై 7) నుంచి నెలరోజుల పాటు నిర్వహించనుంది. కుప్పంలో ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలను నేతలు వివరించనున్నారు. నేటి నుంచి నెలరోజుల పాటు జనం మధ్య నాయకులు తిరగనున్నారు. ఏడాదిలో ఏం చేశాం.. భవిష్యత్‌లో ఏం చేస్తామనే అంశాలపై వివరణ ఇవ్వనున్నారు. నేతలకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. వైసీపీ నేతల దుష్ప్రచారానికి చెక్ పెట్టేలాగా కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి నేతల వరకు అందరూ పాల్గొనాల్సిందేనని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం ప్రారంభం

రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు

For More AP News and Telugu News

Updated Date - Jul 02 , 2025 | 07:47 AM