Share News

TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం

ABN , Publish Date - Nov 29 , 2025 | 02:44 PM

తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు.

TTD Adulterated Ghee Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో మరో కీలక పరిణామం
TTD Adulterated Ghee Case

తిరుపతి, నవంబరు29 (ఆంధ్రజ్యోతి): తిరుమల వేంకటేశ్వరస్వామి కల్తీ నెయ్యి కేసులో (TTD Adulterated Ghee Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే 24 మంది నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో 17 మంది నిందితుల పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తెలిపారు పోలీసులు.


పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన వారిలో టీటీడీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నవారు ఉన్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసిన పేర్లు ఇవే...

  1. పల్లి ఈశ్వరరెడ్డి - వేర్ హౌస్ జేఏ

  2. ముత్త వెంకట అనిల్ కుమార్ - జేఏ

  3. వెంకట నగేశ్‌బాబు - రిటైర్ డిప్యూటీ ఈఓ,

  4. పెరగు జగదీశ్వరరెడ్డి - ఈఈ

  5. పీ. మురళి కృష్ణ - మార్కెటింగ్ జీఎం

  6. సుబ్రమణ్యం మార్కెటింగ్ - మాజీ జీఎం

  7. హరినాథ్‌రెడ్డి - గోశాల డైరెక్టర్

వీరితో పాటు డైరీ టెక్నాలజీ టెక్నికల్ టీంకు చెందిన డాక్టర్ మల్లం మహేందర్ రెడ్డి, డాక్టర్ వెంకట సుబ్రహ్మణ్యం, డాక్టర్ ఎం విజయభాస్కరరెడ్డి, డాక్టర్ బత్తల సురేంద్రనాథ్, డాక్టర్ కే. జయరాజరావులను కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు పోలీసులు.


ఈ వార్తలు కూడా చదవండి..

కర్నూలు రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం: త్రీ మెన్ కమిటీ

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 29 , 2025 | 03:39 PM