Madanapalli Files case: మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం
ABN , Publish Date - Apr 25 , 2025 | 02:32 PM
Madanapalli Files case: మదనపల్లె ఫైళ్ల దహనం కేసుపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఈ కేసులో అనుమానం ఉన్నవారిని విచారణ చేయాలని రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.

చిత్తూరు: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో ఫైళ్ల దహనం కేసులో అరెస్ట్ అయిన మాధవరెడ్డిని చిత్తూరు జిల్లా కోర్టులో సీఐడీ పోలీసులు ఇవాళ(శుక్రవారం) మధ్యాహ్నం హాజరుపరచనున్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డిని నిన్న(గురువారం) సాయంత్రం రొంపిచర్ల వద్ద సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సీఐడీ పోలీసుల అదుపులో ఉన్న మాధవరెడ్డిని జిల్లా ప్రధాన కోర్టులో హాజరు పరిచేందుకు చర్యలు తీసుకున్నారు.
ఫైళ్ల దహనం ఘటనలో మొత్తం తొమ్మిది మందిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఈ కేసులో మదనపల్లె మాజీ ఆర్డీఓ మురళిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరో వ్యక్తి సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ తేజను పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ఈ కేసులో మదనపల్లె ప్రస్తుత ఆర్డీఓ హరిప్రసాద్, మాజీ ఎమ్మెల్యే నవాజ్ భాష, మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింక చలపతి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ తుకారం, మరో ఇద్దరు శశిధర్, రామకృష్ణారెడ్డి ఉన్నారు. మాధవరెడ్డి అరెస్టు నేపథ్యంలో మిగిలిన వారందరూ పరారీ అయినట్లు సమాచారం. మాధవరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన తర్వాత మిగిలిన వారి కోసం సీఐడీ పోలీసులు వేట మొదలుపెట్టనున్నట్లు సమాచారం. అయితే మాధవరెడ్డిని సీఐడీ పోలీసులు తమ కస్టడీకి కోరే అవకాశాలు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
AP NEWS: మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు.. ఏం చేశారంటే..
Deputy CM Pawan Kalyan: ఇక స్థానిక ప్రభుత్వాలు
Visakhapatnam: రెండున్నర గంటలు పరుగెడుతూనే ఉన్నాం
Controversial Cases: అంతా ‘ఒక్క’టయ్యారు
Kashmir Terror Attack: ఉగ్రవాదుల్ని ఏరిపారేయాలి
For More AP News and Telugu News