Share News

Minister Payyavula Keshav: ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ: మంత్రి పయ్యావుల కేశవ్

ABN , Publish Date - Dec 03 , 2025 | 09:34 PM

ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్‌లో అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు.

 Minister Payyavula Keshav: ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ: మంత్రి పయ్యావుల కేశవ్
Minister Payyavula Keshav

అనంతపురం, డిసెంబరు3 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థ తీసుకువస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ (Minister Payyavula Keshav) వ్యాఖ్యానించారు. ప్రజా ఫిర్యాదులపై కలెక్టరేట్‌లో అధికారులతో ఇవాళ(బుధవారం) సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. ఇకపై అర్జీదారుడు ఇచ్చే ప్రతి సమస్య పరిష్కారం అయ్యేందుకు అధికారులు బాధ్యులు అవుతారని సూచించారు. స్వయంగా ఫిర్యాదుదారుతో తాము మాట్లాడామని తెలిపారు. ప్రతి సమస్యను సమగ్రంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు మంత్రి పయ్యవుల కేశవ్.


సీఎం చంద్రబాబు ఆదేశాలతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. తమపై నమ్మకంతోనే ఎక్కువ అర్జీలు వస్తున్నాయని తెలిపారు. సమస్యలను కేటగిరీల వారీగా విభజించి ప్రయత్నిస్తున్నామని వివరించారు. గ్రీవెన్స్ వ్యవస్థ రొటీన్‌గా జరిగేది కాకూడదని సూచించారు. ఈ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. సుమారు 34 వేల అర్జీలు పరిష్కరించామని గుర్తుచేశారు మంత్రి పయ్యవుల కేశవ్.


తమ ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధరతో కొన్నామని చెప్పుకొచ్చారు. బార్లీ, పొగాకు కొన్నామని.. ప్యాడీ కొనుగోలు చేశామని... తాజాగా మొక్కజొన్న సమస్య తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అరటి కొనుగోళ్లపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పుకొచ్చారు. మార్కెట్ అవకతవకలపై ప్రభుత్వం మానిటరింగ్ చేస్తున్నామని మంత్రి పయ్యవుల కేశవ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో భూ రికార్డులు తారుమారు .. సీఎం చంద్రబాబు ఫైర్

శ్రీశైలం దేవస్థానం మరో కీలక నిర్ణయం.. వారికి ఉచిత స్పర్శ దర్శనం..

Read Latest AP News and National News

Updated Date - Dec 03 , 2025 | 09:39 PM