Home » Vijayanagaram
పేదరికం ఆ కుర్రాడి చదువుకు ఆటంకంగా మారింది. చదువుకుని ఇంజనీర్ కావాలని కలలు కన్న ఆ కుర్రాడికి కాలేజీ ప్రయాణం దూరంగా, భారంగా మారింది. ప్రతీరోజూ 40 కిలోమీటర్లు సైకిల్ మీద కాలేజీకి వెళ్లి రావాలంటే మాటలు కాదు. అందుకే తన బుర్రకు పనిపెట్టి, సైకిల్‌నే ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చుకున్నాడు.
పార్వతీపురం మన్యం జిల్లా గుణానుపురం గ్రామానికి చెందిన పల్ల భరత్‌చంద్ర జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా 21వ, ఓబీసీ కేటగిరీలో 2వ ర్యాంకు సాధించి విశేష విజయం సాధించాడు. విజయనగరం జిల్లాకు చెందిన మరికొందరు విద్యార్థులు కూడా జేఈఈలో ఉత్తమ ప్రతిభ చూపించారు.
విజయనగరంలో సిరాజ్ రెహ్మాన్, సయ్యద్ సమీర్‌ల వాక్యూలు ఆధారంగా దర్యాప్తు అధికారులు వేగంగా మార్గదర్శనం చేస్తూ, వరంగల్‌కు చెందిన పర్హాన్ మొహిద్దీన్ మరియు ఖాజీపేట యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విజయనగరం టుటౌన్ పోలీసులు సిరాజ్ కుటుంబ ఆర్థిక లావాదేవీలను పర్యవేక్షించి, సంబంధిత బ్యాంకు అధికారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
విజయనగరంలో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో సిరాజ్, సమీర్‌లను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఎన్‌ఐఏ, ఏటీఎస్ బృందాలు విచారణను ముమ్మరం చేశాయి.
దిల్‌సుఖ్‌నగర్ జంటపేలుళ్ల మాదిరిగా.. హైదరాబాద్, విజయనగరంలో వరుస పేలుళ్లకు భారీ కుట్ర జరిగింది. పేలుళ్లకు అవసరమైన ఐఈడీల తయారీకి అవసరమైన పరికరాలను సిద్ధం చేసుకున్నారు.
విజయనగరం జిల్లా ద్వారపూడిలో ఆట కోసం కారులోకి వెళ్లిన నలుగురు చిన్నారులు, డోర్లు ఆటోమేటిక్‌గా లాకయ్యడంతో ఊపిరాడక మృతి చెందారు.
విజయనగరం కోరకుండ సైనిక్ స్కూల్ మాజీ విద్యార్థులు, నేవీ విశ్రాంత అధికారులైన శ్రీనివాస్ కల్నల్, సీడీఎన్‌వీ ప్రసాద్ సముద్ర యాత్ర ప్రారంభించారు. వారు న్యూజిలాండ్ నుంచి అండమాన్ దీవుల వరకు 34 అడుగుల బోటులో ప్రయాణిస్తున్నారు.
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల మధ్య సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులతో పాటు ప్రముఖులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు
విజయనగరం జిల్లా శివరాం గ్రామంలో యువతిపై యువకుడు కత్తితో దాడి చేసి ఆమెకు తీవ్ర గాయాలు చేశాడు. పోలీసులకు 5 ప్రత్యేక బృందాలు నియమించి కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్నారు
నేడు రామతీర్థంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు